నేనున్నాను సినిమా రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, శ్రియ, ఆర్తి అగర్వల్, రవి బాబు, ముకేష్ రిషి, బ్రహ్మనందం, ఆలీ, ఎమ్ ఈస్ నారాయణ, సునిల్, సుబ్బారాజు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి ఎన్ అదిత్య నిర్వహించారు మరియు నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
వేణు (నాగార్జున) అనాధ ఇతను వైజాగ్ లో కాంట్రాక్టార్. అను (శ్రియా) శాస్త్రీయ గానంలో విద్యార్ధి. శృతి (ఆర్తి అగర్వల్) అను స్నేహితురాలు. అరుణ్ (సుబ్బారాజు) ని అను ప్రేమిస్తుంది, విళ్ళిద్దరు పారిపోయి పెళ్ళిచేసుకోవాలనుకుంటారు అందుకోసం అను ఇంట్లోవాళ్లకు తెలియకుండా వస్తుంది కాని అరుణ్ వాళ్ల నాన్న జేపి (ముకెష్ రిషి) పోలీసులను పంపించడం వల్ల అక్కడ నుంచి అరుణ్ ని తీసుకెల్తారు. అరుణ్ కోసం వచ్చిన అను ఎక్కడికి పోలేని పరిస్థితులలో వుంటే వేణు తన ఇంటికి తీసుకెల్తాడు. వేణు అరుణ్ కి అనుకి పెళ్ళిచేయాలనుకుంటాడు కాని అరుణ్ వాళ్ళ చేప్పినట్లు వేరే అమ్మాయి ని పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. అప్పుడు ఎం చేయాలో తేలియని పరిస్థితిలో వున్న అను ని తన ఇంటికి వేణు ఎలా వేలేలా చేస్తాడు అలాగే ఈ కథ లోకి ఆర్తి అగర్వల్ ఎలా వచ్చింది.....అణు ఎవరిని ప్రేమిస్తుంది అనేది మిగతా కథ...