X
Home టాప్ లిస్టింగ్

2023 జూలైలో విడుదల కానున్న క్రేజీ మూవీస్

Author Administrator | Updated: Monday, July 3, 2023, 02:56 PM [IST]

2023 జులై నెలలో ప్రేక్షకులను అలరించటానికి పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోలా సినిమాలు కూడా వస్తున్నాయి. కంటెంట్ ఉంటే చిన్నా, పెద్ద చిత్రాలు అని సినీ ప్రేక్షకులు చూడడం లేదు కథ నచ్చితే సూపర్ హిట్ చేస్తున్నారు. జులై నెలలో రిలీజ్ కాబోతోన్న మూవీస్ ఒక్కసారి చూద్దాం.


cover image
రంగబలి

రంగబలి సినిమా కామెడీ డ్రామా ఎంటర్టైనర్ ఇందిలో నాగ శౌర్య హీరోగా, యుక్తి తరేజా, అక్కల సత్య, గోపరాజు రమణ, సప్తగిరి, బ్రహ్మాజీ, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, షైన్ టామ్ మిగతా పాత్రల్లో నటించారు. ఈ సినిమా జులై 7న రిలీజ్ అవుతోంది. 

భాగ్ సాలే

భాగ్ సాలే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ సింహ కోడూరి ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రణీత్ బి వహించారు. సంగీతం కాల భైరవ అందించారు. ఈ సినిమా జులై 7న రిలీజ్ అవుతోంది. 

రుద్రంగి

రుద్రంగి సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులు నటించారు. ఒకప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులను నేపథ్యంగా ఎంచుకుని పీరియాడిక్ మూవీగా 'రుద్రంగి' రూపొందింది. నాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. జులై 7 న సినిమా విడుదలవనుందని చిత్రబృందం ప్రకటించింది.

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉన్న హీరోల్లో శివకార్తికేయన్ ఒకడు. అతడి నటించిన చాలా సినిమాలు ఇక్కడ డబ్ అవడమే కాకుండా మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. రెమో, డాక్టర్, డాన్ లాంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. శివకార్తికేయన్ నటిస్తున్న సరికొత్త చిత్రం మహావీరుడు. ఈ సినిమా జులై 7న రిలీజ్ అవుతోంది. 

బేబీ

బేబీ మూవీ రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌, అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్, సత్య, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జులై 7న రిలీజ్ అవుతోంది. 

ఊరు పేరు భైరవకోన

ఊరు పేరు భైరవకోన  సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి ఆనంద్ వహించారు. నిర్మాత రాజేష్ దొంద నిర్మించారు. సంగీతం శేఖర్ చంద్ర అందించారు.  ఈ సినిమా జులై 21న రిలీజ్ అవుతోంది. 

చైతన్యరావు, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. గోదావరి ప్రాంతంలో జరిగే ఓ చిన్న, ఫన్నీ లవ్ స్టోరీనే ప్రధాన కథాంశంగా తీసుకొని ఈ మూవీని తెరకెక్కించినట్టుగా అర్థమవుతుంది. ఈ సినిమా జూలై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

బ్రో

తమిళంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించి... దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం వినోదయ సీతమ్ కి తెలుగు రీమేక్ గా బ్రో సినిమాను నిర్మించారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చేంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు నటించారు.  ఈ మూవీ ని జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు.

ఆది కేశవ

ఆదికేశవ మూవీ యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీకాంత్ ఎన్ రెడ్డి వహించారు.సంగీతం సాయి సౌజన్య అందించారు. ఈ సినిమా జూలై 29 న విడుదల కానుంది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+