నెక్స్ట్ ఏంటి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, తమన్నా, నవదీప్, పూనమ్ కౌర్, శరత్ బాబు దితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కునాల్ కోహ్లీ వహించారు మరియు నిర్మాతలు రైనా జోషి, పూరి అక్షయ్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం లియోన్ జేమ్స్ స్వరాలు సమకుర్చరు.
కథ
లండన్‌లో పెరిగినప్పటికీ భారతీయ సంప్రదాయాలకు విలువనిచ్చే యువతి టామీ (తమన్నా భాటియా). తల్లి చిన్నతనంలో మరణించడంతో తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. అలాంటి టామి సంజు (సందీప్) అనే యువకుడితో ప్రేమలో పడుతుంది. ఆర్నెళ్ల తర్వాత పెళ్లికి ముందే సెక్స్ విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోతారు. ఆ తర్వాత క్రిష్ (నవదీప్) అనే పారిశ్రామిక వేత్తతో రిలేషన్ పెట్టుకోవడం అది కూడా బ్రేకప్ కావడంతో మగవాళ్లపై ఓ రకమైన విద్వేషం పెంచుకొంటుంది?
సంజుతో బ్రేకప్ వల్ల టామీలో ఎలాంటి మార్పులు వచ్చాయి? పెళ్లికి ముందు సెక్స్ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకొన్నదా? భార్యతో విడాకులు పొందిన క్రిష్‌తో టామీ ఎలా ప్రేమలో పడింది? క్రిష్‌తో రిలేషన్ ఎందుకు బ్రేకప్ అయింది? టామీకి తన తండ్రి (శరత్ బాబు)కి ఎలాంటి అనుబంధం ఉంది అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నెక్ట్స్ ఏంటీ మూవీ.