ఎన్‌జికే సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకూమార్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, జగపతి బాబు, బాలా సింగ్, మాన్ సూర్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సెల్వరాఘవన్ వహించారు మరియు నిర్మాత ఎస్ ఆర్ ప్రభు వహించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించారు.
కథ
నంద గోపాల కృష్ణ అలియాస్ NGK ఎంటెక్ చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆర్గానిక్ వ్యవసాయంపై మక్కువతో జాబ్‌ను వదిలేసి తన సొంత ఊరు శృంగవరపు కోటకు వస్తాడు. భార్య (సాయిపల్లవి)తో హ్యాపీగా జీవితం సాగిస్తూనే, పోరాటలు చేస్తూ ప్రజలను చైతన్యం చేసే దిశగా అడుగులేస్తుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా గ్రామ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ క్రమంలో అధికార పొలిటిక్ పార్టీలోని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వనిత (రకుల్)తో సన్నిహిత సంబంధాలు పెట్టుకొంటాడు. అలా గ్రామీణ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెడుతాడు. NGK ఎదుగుదలను చూడలేక అధికార, ప్రతిపక్ష పార్టీలు కక్ష కడుతాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు ఏ పై ఎత్తులు వేశాడు. వనిత (రకుల్)తో ప్రైవేట్ సంబంధం వివాహిక జీవితంలో ఎలాంటి చిక్కుల తెచ్చిపెట్టాయి. రాజకీయ ప్రయాణంలో భర్త అనుసరిస్తున్న పద్దతులకు భార్య (సాయిపల్లవి) ఎలా స్పందించింది. చివరకు రాష్ట్ర సీఎంగా ఎంపిక కావడానికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎలా సానుకూలంగా మలుచుకొన్నాడు. NGK జీవితంలో చివరకు వనిత, సాయి పల్లవి ఎలాంటి పాత్ర పోషించారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.