X
తెలుగు » సినిమాలు » ఎన్‌జికే
ఎన్‌జికే

ఎన్‌జికే

Action | 31 May 2019 | U | 148 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఎన్‌జికే స్టోరీ

ఎన్‌జికే సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకూమార్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, జగపతి బాబు, బాలా సింగ్, మాన్ సూర్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సెల్వరాఘవన్ వహించారు మరియు నిర్మాత ఎస్ ఆర్ ప్రభు వహించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించారు.  కథ నంద గోపాల కృష్ణ అలియాస్ NGK ఎంటెక్ చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆర్గానిక్ వ్యవసాయంపై మక్కువతో జాబ్‌ను వదిలేసి తన సొంత ఊరు శృంగవరపు కోటకు వస్తాడు. భార్య (సాయిపల్లవి)తో హ్యాపీగా జీవితం సాగిస్తూనే, పోరాటలు చేస్తూ ప్రజలను చైతన్యం చేసే దిశగా అడుగులేస్తుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా గ్రామ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ క్రమంలో అధికార పొలిటిక్ పార్టీలోని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌ వనిత (రకుల్)తో సన్నిహిత సంబంధాలు పెట్టుకొంటాడు. అలా గ్రామీణ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెడుతాడు. NGK ఎదుగుదలను చూడలేక అధికార, ప్రతిపక్ష పార్టీలు కక్ష కడుతాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు ఏ పై ఎత్తులు వేశాడు. వనిత (రకుల్‌)తో ప్రైవేట్ సంబంధం వివాహిక జీవితంలో ఎలాంటి చిక్కుల తెచ్చిపెట్టాయి. రాజకీయ ప్రయాణంలో భర్త అనుసరిస్తున్న పద్దతులకు భార్య (సాయిపల్లవి) ఎలా స్పందించింది. చివరకు రాష్ట్ర సీఎంగా ఎంపిక కావడానికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎలా సానుకూలంగా మలుచుకొన్నాడు. NGK జీవితంలో చివరకు వనిత, సాయి పల్లవి ఎలాంటి పాత్ర పోషించారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. 
Read More

ఎన్‌జికే కాస్ట్ & క్రూ

ఎన్‌జికే సిబ్బంది సమాచారం

దర్శకత్వం సెల్వ రాఘవన్
సినిమాటోగ్రఫీ శివకుమార్ విజయన్
సంపాదకుడు ప్రవీణ్ కె ఎల్
సంగీతం యువన్‌శంకర్‌రాజా
నిర్మాత ఎస్ ఆర్ ప్రభు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎన్‌జికే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సాధారణ కుటుంబంలో విద్యాధికుడైన యువకుడు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవిని ఎలా చెప్పట్టాడనే సింగిల్ ఎజెండా పాయింట్‌తో రూపొందిన చిత్రం NGK. కథలో బలం లేకుండా కథనంలో పస లేకుండా వండి వార్చిన వంటకం ఈ సినిమా అని చెప్పవచ్చు. ప్రేక్షకుడిని సునాయసంగా థియేటర్‌కు రప్పించే భారీ తారలకు సరైన పాత్రలను డిజైన్ చేయడంలో ఘోర వైఫల్యం ఈ సినిమాలో కనిపిస్తుంది. సూర్య మీద కక్ష కట్టి సెల్వరాఘవన్ సినిమా తీశాడా అనే సందేహం కూడా కలుగక మానదు. ఏ దశలోనూ ప్రేక్షకుడిని ఒప్పించలేకపోయిన సినిమా NGK అని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ పొందితే సినిమా కలెక్షన్లపరంగా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి.

ఎన్‌జికే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎన్‌జికే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+