ఎన్ హెచ్4 సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ చిత్రం ఇందులో సిద్దార్థనారాయణ, అశ్రిత శెట్టి, కిశోర్, కె కె మీనన్, అజై, అవినాశ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణిమరన్ నిర్వహించారు మరియు నిర్మాత బి సుబ్రమణ్యం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జి వి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకుర్చారు.
కథ
కథలోకి వెళితే...ప్రభు(సిద్దార్థ్), అతని స్నేహితులు అనంతపురం నుంచి బెంగుళూరు వెళ్లి అక్కడ కాలేజీలో చేరతారు. అదే కాలేజీలో చదువుతున్న రితిక(ఆశ్రిత శెట్టి) ప్రభు ఆటిట్యూడ్, బిహేవియర్ నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. ప్రభు కూడా రితికను ప్రేమిస్తాడు. ఒకరోజు వీరి ప్రేమ విషయం బెంగులూరులో పెద్ద పొలిటికల్ లీడర్ అయిన రితిక తండ్రికి తెలిసి పోతుంది. దీంతో రితికను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ప్రభును, అతని స్నేహితులను కాలేజీలో చెడ్డీలపై నిలబెట్టి పోలీసులతో కొట్టించి అవమానిస్తాడు.
నువ్వు లేకుండా నేను ఉండలేను, లేచి పోదాం అని రితిక చెప్పడంతో....ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం బెంగుళూరు నుంచి ఎస్కేప్ అవుతారు. ఫ్రెండ్స్ వారికి సహాయం చేస్తారు. విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందనే భయంతో రితిక తండ్రి...తనకు నమ్మకమైన పోలీస్ ఆఫీసర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ మనోజ్ మీనన్(కెకె మీనన్)ను రంగంలోకి దింపుతాడు. రెండు గంటల్లో మీ కూతుర్ని మీ ముందు ఉంచుతాను మాటిస్తాడు మనోజ్ మీనన్. ప్రభు-రితిక ఎలా తప్పించుకున్నారు? చివరికి ఏమైంది అనేది మిగతా స్టోరీ.