twitter

    101 జిల్లాల అందగాడు స్టోరి

    101 జిల్లాల అందగాడు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీనివాస్ అవ‌స‌రాల, రుహ‌నీ శ‌ర్మ, రోహిణి, రాకెట్ రాఘవ, కృష్ణ భగవాన్ తదితరులు నటించారు. రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ దర్శకత్వం వహించారు. వై రాజీవ్ రెడ్డి, జె సాయి బాబు, శిరీష్ కలిసి నిర్మించారు. సంగీతం శక్తికాంత్ కార్తిక్ అందించారు.

    కథ 
    రియల్ ఎస్టేట్ కంపెనీలో కస్టమర్ రిలేషన్ మేనేజర్ (సీఆర్ఎమ్)గా పనిచేసి సూరి అలియాస్ గొట్టి సూర్య నారాయణ ( జీఎస్ఎన్ (అవసరాల శ్రీనివాస్)) బట్టతల కారణంగా ఓ రకమైన అభద్రతాభావంతో ఉంటాడు. విగ్గు పెట్టుకొంటే కానీ కాన్ఫిడెన్స్‌గా కనిపించడు. తనకు బట్టతల ఉందనే విషయం గుర్తిస్తారనే భయంతో మానసికంగా ఓ రకమైన క్షోభకు గురవుతుంటాడు. ఆ క్రమంలో తన ఆఫీస్‌లో అంజలి ( రుహానీ శర్మ) అనే ఉత్తరాదికి చెందిన అమ్మాయి జాబ్‌లో చేరుతుంది. అంజలిని చూసి తొలిచూపులోనే సూరి మనసుపడేసుకొంటాడు? వారి ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చిన నేపథ్యంలో సూరికి బట్టతల ఉందనే విషయం అంజలి, ఆమె కుటుంబ సభ్యులకు తెలుస్తుంది? బట్టతల కారణంగా సూరి మానసికంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు? సూరి జీవితంలో కొన్ని అనుభవాలు ఎలాంటి భావోద్వేగానికి గురిచేశాయి? సూరికి బట్టతల ఉందనే విషయం తెలిసిన అంజలి రియాక్షన్ ఏమిటి? అంజలి ఉద్యోగం మానేసి గుర్గావ్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం అసలు కారణం ఏమిటి? సూరి బట్టత లను చూసిన అంజలి కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఇలాంటి ఎమోషనల్ పరిస్థితుల మధ్య ఉద్యోగపరమైన ఒత్తిడులను సూరి ఎలా అధిగమించాడు? చివరికి సూరి, అంజలి మధ్య బంధానికి ఎలాంటి ముగింపు దొరికింది అనే ప్రశ్నలకు సమాధానమే నూటోక్క జిల్లాల అందగాడు.
    **Note:Hey! Would you like to share the story of the movie 101 జిల్లాల అందగాడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X