నువ్వా నేనా సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, శర్వానంద్, శ్రియ, విమలా రామన్, బ్రహ్మనందం, కోవై సరళ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నారాయణ నిర్వహించారు మరియు నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బీమ్స్ స్వరాలు సమకుర్చారు.
కథ
చిల్లర దొంగ అవినాష్(అల్లరి నరేష్)ఓ పెద్ద దొంగతనం చేసి తింగరి పోలీసులకు మస్కా కొట్టి హైదరాబాద్ (ఇక్కడ దొంగలకు సేప్టీ ప్లేస్ అన్నట్లు)వచ్చేస్తాడు. సిటీలోకి అడుగు పెట్టగానే అక్కడ అతనికి యాజ్ యూజవల్ గా డా.నందిని(శ్రియ)కనిపిస్తుంది. కనిపించిందే తడువుగా ఆలస్యమెందుకున్నట్లు పాటేసుకుని అక్కడనుంచి ఆమె హాస్పటిల్ కి వెళ్లి మరీ లైన్ వేస్తూంటాడు. అతను అంత పట్టుదలగా తిరుగుతున్నా సైక్రాటిస్టు అయిన ఆమె మన హీరో ఎందుకు వచ్చాడా అన్నది పట్టించుకున్నట్లు కనపడదు. ఈలోగా ఆమె హాస్పటిల్ కి ఆనంద్(శర్వానంద్)అనే భయం ఫోబియో తో బాధపడే పేషెంట్ వస్తాడు. ఆమె ఇచ్చిన కౌగిలి ట్రీట్ మెంట్ తో అతను రోగం కుదిరి...కొత్త రోగం(ప్రేమ)మొదలవుతుంది. దాంతో ఆనందే...అవినాష్ ప్రేమకు అడ్డు వస్తాడు. ఇద్దరూ ఆమె కోసం కాట్ల కుక్కల్లా కొట్టుకుంటారు..చివరకు చంపుకునే స్ధితి దాకా వస్తారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి నందిని దక్కింది అనేది తెలియాలంటే సినిమా చివరదాకా చూడాల్సిందే.