నువ్విలా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అజయ్, హవీష్, ప్రసాద్, యామి, సరయు, రమ్య, రాధాకుమారి, రవిబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: రవిబాబు నిర్వహించారు మరియు నిర్మాత రామోజిరావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు స్వరాలు సమకుర్చారు.
కథ
పిజ్జా కార్నల్ పనిచేసే ముగ్గరు స్నేహితులు,వారి ప్రేమ కథలు చుట్టూ ఈ సినిమా సాగుతుంది.వారిలో ఆనంద్(అజయ్)ప్రతీ విషయానికి కన్ఫూజ్ అయ్యే కుర్రాడు.అతను తన ఎదురింట్లో దిగిన అమ్మాయి అర్చన(యామి)తో ప్రేమలో పడతాడు.కానీ అప్పటికే అర్చన విష్ణు అనే క్రికెటర్ తో హద్దులు దాటి ఉంటుంది.ఇక రెండో వాడు రాజు(ప్రసాద్)నత్తి ఉన్న వైలనిస్టు.దాంతో ప్రతీ మ్యూజిక్ డైరక్టర్ దగ్గరి వెళ్లటం అక్కడ పాడమంటే తన నత్తితో ఆఫర్ పోగొట్టుకుని రావటం జరుగుతుంది.అతని చిన్నప్పటి క్లాస్ మేట్ రాణి(రమ్య)ని అతను ఓ శనిలా భావిస్తూంటాడు.అయితే అనుకోని పరిస్దితుల్లో ఆమెనే పెళ్లి చేసుకోవాల్సివస్తుంది .ఇక మూడో వాడు మహేష్ (హవీష్)ఓ పాపులర్ మోడల్ అవ్వాలని జీవితాశయం.అతనికి మాధవి(సరయూ)ప్రేమ.అయితే అనుకోకుండా ఆమె తండ్రితో తగువుపడతాడు.దాంతో ఆమె అతనికి బుద్ది చెప్పాలని ఓ గే ని అతని మీదకు ఉసిగొల్పుతుంది.ఇలా ముగ్గరూ మూడు విధాలుగా సమస్యల్లో పడతారు.వారు ఆ సమస్యల నుంచి ఎలా బయిటకు వచ్చి తమ జీవితాశయాలను నెరవేర్చుకున్నారనేది మిగతా కథ.