నువ్వు తోపురా స్టోరి

  నువ్వు తోపురా సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధాకర్ కోమాకుల, నిత్య శెట్టి, నిరోషా, మహేష్ విట్ట, రాకింగ్ రాకేష్, రవి వర్మ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరినాథ్ బాబు బి వహించారు  మరియు నిర్మాత డి శ్రీకాంత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శీ పి ఎ దీపక్ అందించారు. 

  కథ

  పక్కా హైదరాబాదీ.. సరూర్ నగర్‌కు చెందిన సూరి (సుధాకర్ కోమాకుల) పోరంబోకు. బీటెక్ ఫెయిల్ అయి ఫ్రెండ్స్‌తో సరదాలు చేసే యువకుడు. ఓ కారణంగా తల్లిని ద్వేషిస్తాడు. చెల్లెలు అంటే ప్రేమ ఉండదు. అలాంటి ఓ పోకిరి యూఎస్‌కు వెళ్లి ఎంఎస్ చేయాలనే ఓ లక్ష్యమున్న రమ్య (నిత్యాశెట్టి)తో ప్రేమలో పడుతాడు. ఫ్రెండ్స్ చేసిన ఓ పని కారణంగా వారి మధ్య విభేదాలు ఏర్పడుతాయి. దాంతో సూరిని విడిచి రమ్య యూఎస్ వెళ్తుంది. ఊహించని పరిస్థితుల మధ్య ఓ అవకాశం రావడంతో సూరి అమెరికాకు వెళ్తాడు. అమెరికాకు వెళ్లిన సూరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? రమ్యతో ప్రేమ మళ్లీ చిగురించిందా? తల్లి, చెల్లిని ప్రేమించడానికి ఎలాంటి పరిస్థితులు సూరిపై ప్రభావం చూపించాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పాత్ర ఏంటి? సినిమాకు వరుణ్ సందేశ్ పాత్ర ఏ మేరకు హెల్ప్ అయింది? గ్రీన్ కార్డు హోల్డర్ కావాలని వరుణ్ చేసిన ప్రయత్నాలు ఎలా ఫలించాయి అనే ప్రశ్నలకు సమాధానమే నువ్వు తోపురా సినిమా కథ.
  **Note:Hey! Would you like to share the story of the movie నువ్వు తోపురా with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X