ఆఫీసర్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైన చిత్రం ఇందులో ప్రధానపాత్రలో నాగార్జున, మైర సరీన్, ఫిరోజ్ అబ్బాసి బేబి కావ్య, సయాజి షిండే, అజై తదితరులు నటించారు. ఈ సినిమాని కంపనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్ గోపాల్ వర్మ తన స్వియ దర్శకత్వంలో రూపిందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రవిశంకర్ అందించారు.
కథ
ముంబైలో మాఫియాను గడగడలాడించిన పోలీసు అధికారి నారాయణ పసారి (ఫిరోజ్ అబ్బాసి). ఆయన ఎన్‌కౌంటర్ స్సెషలిస్ట్. కానీ ఓ భూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆ కేసును విచారించడానికి చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి శివాజీ రావు (నాగార్జున) అనే ఆఫీసర్‌ను అపాయింట్ చేస్తారు. కేసు దర్యాప్తులో భాగంగా పసారిని శివాజీ అరెస్ట్ చేస్తాడు.
ఆ తర్వాత కేసు నిలబడకపోవడంతో పసారిని మళ్లీ ఉద్యోగంలో చేర్చుకొంటారు. ఈ నేపథ్యంలో పసారి, శివాజీ మధ్యలో విభేదాలు ముదురుతాయి. శివాజీని ఎదుర్కోవడానికి ముంబైలో పసారి మళ్లీ ఓ మాఫియాను సృష్టిస్తారు. పసారి ఎత్తులను శివాజీ ఎలా ఎదుర్కొన్నారు? పసారి సృష్టించిన మాఫియాను శివాజీ ఎలా మట్టుపెట్టారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఆఫీసర్ సినిమా చూడాల్సిందే.