ఓ మై ఫ్రెండ్ సినిమ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్ధార్థ్,శ్రుతి హాసన్, హన్సిక, నవదీప్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అలీ, లక్ష్మీ రామకృష్ణన్, వినయప్రసాద్ తదితరులు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే,మాటలు,దర్శకత్వం: వేణు శ్రీరామ్ నిర్వహించారు మరియు నిర్మత దిల్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాహుల్ రాజ్ స్వరాలు అందించారు.
కథ
ఒక అబ్బాయి ఒక అమ్మాయి జీవితాంతం స్నేహుతులగా ఉండగలా అనే పాయింట్ ని బేస్ చేసుకుని వచ్చిన ఈ చిత్రంలో గిటారిస్టు చందు (సిద్ధార్థ్),డాన్సర్ సిరి (శ్రుతి హాసన్)చిననాటి ప్రెండ్స్.వయస్సు వచ్చినా వీరు కలిసి తిరగటం,చనువుగా ఉండటం చూసి ఎప్పటిలాగే వీళ్లిద్దరూ ప్రేమికులేమో అని వీళ్ల తల్లి తండ్రులతో సహా ప్రపంచం మొత్తం ఆపార్దం చేసుకుంటుంది .ప్రపంచంతో మనకేమి పని అనకున్న వీళ్లు విడివిడిగా వేరే వేరే వ్యక్తులతో(రీతు (హన్సిక)తో చందు,ఉదయ్ (నవదీప్)తో సిరి) ప్రేమలో పడతారు.అయితే వీళ్ళని ప్రేమించి వాళ్లిద్దరు కూడా సదరు ఆ ప్రపంచంలోని వ్యక్తులే కాబట్టి...చందు,సిరిల స్నేహానుభంధం చూసి ఈ సారి రీతు,ఉదయ్ లు అపార్దం చేసుకుంటారు.అంతేగాక మీ స్నేహ బంధం విడిపోతేనే మన వివాహాలు జరుగుతాయని ఖచ్చితంగా చెప్పేస్తారు.అటువంటి సమయంలో క్లోజ్ ప్రెండ్స్ అయిన చందు,సిరిలు ఏ నిర్ణయం తీసుకున్నారనేది తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే.