ఓకే ఓకే సినిమా తమిళ్ డబ్బింగ్ చిత్రం ఇది ఒక కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్, ఇందులో ఉదయనిధి స్టాలిన్, హన్సిక, సంతానం, ఆర్య, షాయాజి షిండే, ఉమా పద్మనాభన్, స్నేహ, ఆండ్రియా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్ రాజేష్ నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకోండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరీష్ జైరాజ్ స్వరాలు సమకుర్చారు.
కథ
శ్రీనివాస్(ఉదయ నిధి స్టాలిన్) పాపులర్ మల్టీ ప్లెక్స్ లో పని చేస్తూ ఉంటాడు. బంగార్రాజు(సంతానం)అతని కొలిగ్ అండ్ క్లోజ్ ఫ్రెండ్. పోలీస్ ఆఫీసర్(షాయాజీ షిండే) కూతురైన మీరా(హన్సిక)ను శ్రీనివాస్ ప్రేమిస్తాడు. అయితే మీరా మాత్రం పెద్దగా ఇంట్రస్టు చూపదు. తన వెంట పడుతున్న శ్రీనివాస్‍ను భయపెట్టడానికి అతన్ని తీసుకెళ్ళి డిప్యూటీ కమీషనర్ అయిన తన తండ్రికి పరిచయం చేస్తుంది. అయినా భయపడని శ్రీనివాస్... మీరా వెంట పడుతాడు. శ్రీనివాస్ ప్రేమని నమ్మిన మీరా అతన్ని ప్రేమించి పెళ్ళికి సిద్దమవుతుంది. కానీ మనసు మార్చకుని వేరే అబ్బాయితో పెళ్లికి రెడీ అవుతుంది. మరి ఊహించని ఈ ట్విస్ట్ వెనక కారణం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.