X
ఓకే ఓకే

ఓకే ఓకే

Comedy | Romance | 31 Aug 2012 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఓకే ఓకే స్టోరీ

ఓకే ఓకే సినిమా తమిళ్ డబ్బింగ్ చిత్రం ఇది ఒక కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్, ఇందులో ఉదయనిధి స్టాలిన్, హన్సిక, సంతానం, ఆర్య, షాయాజి షిండే, ఉమా పద్మనాభన్, స్నేహ, ఆండ్రియా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్ రాజేష్ నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకోండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరీష్ జైరాజ్ స్వరాలు సమకుర్చారు. కథ శ్రీనివాస్(ఉదయ నిధి స్టాలిన్) పాపులర్ మల్టీ ప్లెక్స్ లో పని చేస్తూ ఉంటాడు. బంగార్రాజు(సంతానం)అతని కొలిగ్ అండ్ క్లోజ్ ఫ్రెండ్. పోలీస్ ఆఫీసర్(షాయాజీ షిండే) కూతురైన మీరా(హన్సిక)ను శ్రీనివాస్ ప్రేమిస్తాడు. అయితే మీరా మాత్రం పెద్దగా ఇంట్రస్టు చూపదు. తన వెంట పడుతున్న శ్రీనివాస్‍‌ను భయపెట్టడానికి అతన్ని తీసుకెళ్ళి డిప్యూటీ కమీషనర్ అయిన తన తండ్రికి పరిచయం చేస్తుంది. అయినా భయపడని శ్రీనివాస్... మీరా వెంట పడుతాడు. శ్రీనివాస్ ప్రేమని నమ్మిన మీరా అతన్ని ప్రేమించి పెళ్ళికి సిద్దమవుతుంది. కానీ మనసు మార్చకుని వేరే అబ్బాయితో పెళ్లికి రెడీ అవుతుంది. మరి ఊహించని ఈ ట్విస్ట్ వెనక కారణం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

ఓకే ఓకే కాస్ట్ & క్రూ

ఓకే ఓకే సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాజేష్ ఎమ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఓకే ఓకే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రపీ, వివేక్ హర్షన్ ఎడిటింగ్ ఫర్వాలేదు. సాంగ్ సీక్వెన్స్ లో కెమెరా వర్క్ ఎక్సలెంట్‌గా ఉంది. హరిష్ జైరాజ్ మ్యూజిక్ ఓకే. డబ్బింగ్ సినిమా కావడంతో తమిళంలో పేలినట్లుగా కామెడీ డైలాగులు తెలుగులో పేలలేక పోయాయి. స్క్రీన్ ప్లే ఫర్వా లేదు. సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సింపుల్ సోరీ లైన్‌ను స్క్రీన్ ప్లే, కామెడీ సీన్లతో లాక్కొచ్చారు. జస్ట్ వన్ టైం వాచ్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా స్నేహితులతో కలిసి వెళితే సరదాగా నవ్వుకుని రావొచ్చు.

ఓకే ఓకే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఓకే ఓకే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+