ఒక్క అమ్మాయి తప్ప సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సందీప్ కిషన్, నిత్యమీనన్, బ్రహ్మానందం, అలీ, సప్తగిరి, రవి కిషన్, పృద్వి, అజై, జాన్సి, జయప్రకాష్, బ్రహ్మజి, తాగుబోతు రమేష్ తదితరులుతదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజసింహా తాడినాడ నిర్వహించారు మరియు నిర్మాత బోగాది అంజిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చరు.
కథ
దేశంలో పలు బాంబు పేలుళ్లకు పాల్పడిన ప్రమాదకరమైన ఉగ్రవాద అస్లాంభాయ్ (రాహుల్ దేవ్)ను పోలీసులు పట్టుకుంటారు. హైదరాబాద్ జైలు నుండి అతన్ని తప్పించడానికి అన్వర్(రవి కిషన్) ప్లాన్ చేస్తాడు. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్‌కు బాంబు బిగించి ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్ చేసి ట్రాఫిక్ జామ్ చేస్తారు. వందలాది మంది ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటారు. వీరిలో కృష్ణ(సందీప్ కిషన్), మ్యాంగో(నిత్యా మీనన్) కూడా ఉంటారు. తను ప్లాన్ చేసిన రిమోట్ ఆపరేషన్ అమలు చేయడానికి ఖయ్యుం అనే వ్యక్తిని పంపిస్తాడు అన్వర్. అయితే ఖయ్యుం అక్కడికి రాక పోవడంతో అన్వర్ ప్లాన్ ఫెయిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. కొన్ని పరిస్థితుల వల్ల కృష్ణ...ఖయ్యు స్థానంలో ఆ ప్లాన్ అమలు చేయాల్సి వస్తుంది. అసలు అన్వర్‌కి... కృష్ణకి సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.