X
ఒక్క క్షణం
Thriller | 28 Dec 2017 | U/A |
Telugu

ఒక్క క్షణం స్టోరీ

ఒక్క క్షణం సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విఐ ఆనంద్ వహించారు మరియు నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణి శర్మ అందించారు. 

కథ

జీవా (అల్లు శిరీష్), జో (సురభి) లవర్స్. జో ఫ్లాట్‌కు ఎదురుగా ఉంటే ఫ్లాట్‌లో శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) దంపతులు ఉంటారు. అయితే శ్రీనివాస్, స్వాతి దంపతుల మధ్య ఎప్పుడు గొడవ పడుతుంటారు. వారిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారనే విషయాన్ని జీవా తెలుసుకోవడానికి ప్రయత్నించగా వారి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలే తమ జీవితంలో కూడా జరుగుతున్నాయని తెలుసుకొంటారు. ఈ నేపథ్యంలో స్వాతి దారుణ హత్యకు గురవుతుంది. స్వాతి హత్యా నేరం శ్రీనివాస్‌పై మోపబడి అతను జైలుకెళ్తాడు. ఈ నేపథ్యంలో తమ జీవితంలో కూడా ఇలానే జరుగుతుందా అని జీవా, జో భయంతో వణికిపోతారు. ఇంతకీ స్వాతిని శ్రీనివాస్ చంపాడా? లేదా స్వాతి ఎలా దారుణ హత్యకు గురైంది? జీవా, జో జీవితంలో కూడా ఇలాంటి సంఘనలే జరిగాయా? జో కూడా హత్యకు గురవుతుందా? లేదా స్వాతి, శ్రీనివాస్ లైఫ్‌లో జరిగిన సంఘటనుల తమ జీవితంలో చోటుచేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొన్నారు అనే తెర మీద ప్రశ్నలకు సమాధానమే ఒక్క క్షణం సినిమా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+