X
తెలుగు » సినిమాలు » ఒక్క క్షణం
ఒక్క క్షణం

ఒక్క క్షణం

Thriller | 28 Dec 2017 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఒక్క క్షణం స్టోరీ

ఒక్క క్షణం సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విఐ ఆనంద్ వహించారు మరియు నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణి శర్మ అందించారు.  కథ జీవా (అల్లు శిరీష్), జో (సురభి) లవర్స్. జో ఫ్లాట్‌కు ఎదురుగా ఉంటే ఫ్లాట్‌లో శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) దంపతులు ఉంటారు. అయితే శ్రీనివాస్, స్వాతి దంపతుల మధ్య ఎప్పుడు గొడవ పడుతుంటారు. వారిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారనే విషయాన్ని జీవా తెలుసుకోవడానికి ప్రయత్నించగా వారి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలే తమ జీవితంలో కూడా జరుగుతున్నాయని తెలుసుకొంటారు. ఈ నేపథ్యంలో స్వాతి దారుణ హత్యకు గురవుతుంది. స్వాతి హత్యా నేరం శ్రీనివాస్‌పై మోపబడి అతను జైలుకెళ్తాడు. ఈ నేపథ్యంలో తమ జీవితంలో కూడా ఇలానే జరుగుతుందా అని జీవా, జో భయంతో వణికిపోతారు. ఇంతకీ స్వాతిని శ్రీనివాస్ చంపాడా? లేదా స్వాతి ఎలా దారుణ హత్యకు గురైంది? జీవా, జో జీవితంలో కూడా ఇలాంటి సంఘనలే జరిగాయా? జో కూడా హత్యకు గురవుతుందా? లేదా స్వాతి, శ్రీనివాస్ లైఫ్‌లో జరిగిన సంఘటనుల తమ జీవితంలో చోటుచేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొన్నారు అనే తెర మీద ప్రశ్నలకు సమాధానమే ఒక్క క్షణం సినిమా.
Read More

ఒక్క క్షణం కాస్ట్ & క్రూ

ఒక్క క్షణం సిబ్బంది సమాచారం

దర్శకత్వం వి అనంద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత చక్రి చిరుగుపతి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఒక్క క్షణం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తొలిభాగం ఆరంభంలో కథలోకి వెళ్లడానికి దర్శకుడు కొంత ఎక్కువ సమయమే తీసుకొన్నాడనిపిస్తుంది. కథలోకి వెళ్లిన తర్వాత ఆసక్తికరమైన ట్విస్టులతో ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ప్రేక్షకుడిని తీసుకెళ్తాడు. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో రెండో భాగంపై ఆసక్తిపెంచేలా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఇక రెండో భాగంలో జీవా, జో తమ జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయనే భయాందోళనల మధ్య కథ సాగుతుంటుంది. ప్రీ క్లైమాక్స్‌కు ముందు మెడికల్ మాఫియా అంశాన్ని జొప్పించడంతో కథ మరో మలుపుతిరుగుతుంది. అక్కడ నుంచి కథ, కథనాలు వేగం పుంజుకోవడం, దాసరి అరుణ్ కుమార్ విలన్‌గా రంగ ప్రవేశం చేయడం ప్రేక్షకుడికి సరికొత్తగా అనిపిస్తుంది. కాకపోతే సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్ల కోసం క్లైమాక్స్‌ను సాగదీయడం కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. అనవసరమైన నస లేకుండా కథను ఆసక్తిగా చెప్పి ఉంటే సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువ కావడానికి మరింత ఆస్కారం ఉండేది.

ఒక్క క్షణం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఒక్క క్షణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+