ఓనమాలు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, కల్యాణి, గిరిబాబు, చలపతిరావు, రఘుబాబు తదితరలు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రాంతి మాధవ్ నిర్వహించారు మరియు సన్ పైన్ సినిమా నిర్మాన సంస్థ నిర్మించిది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోఠి స్వరాలు సమకుర్చారు.
కథ
నారాయణ రావు మాస్టారు(రాజేంద్రప్రసాద్)కి తను పుట్టిన ఊరన్నా, పల్లె వాతావరణం అన్నా, అక్కడి జనం మధ్య ఉన్న ఆప్యాయతలు అన్నా మహా ఇష్టం. అయితే పిల్లలు అమెరికా వెళ్లి పోవడంతో వారితో పాటు అక్కడికెళ్లిన మాస్టారు మనసుకు ఇష్టం లేకున్నా అక్కడ కొన్నాళ్లు అయిష్టంగానే గడిపి ఇక ఉండలేక మళ్లీ తన పల్లెబాట పడతాడు. తన పల్లె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఊరుచేరుకున్న మాస్టారు.......అనుకోని పరిస్థితులను చూసి ఖంగుతింటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నారాయణరావు మాస్టారు ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.