X
ఊరికి ఉత్తరాన
Action | Romance | 19 Nov 2021 | U/A | 122 Mins
Telugu

ఊరికి ఉత్తరాన స్టోరీ

ఊరికి ఉత్తరాన సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేన్ వనపర్తి, దీపాలి శర్మ, అంకిత కొయ్య, చక్రపాణి ఆనంద, రామరాజు  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సతీష్ పారంవేద వహించారు. నిర్మాత వనపర్తి వెంకటయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ అందించారు. 

కథ 
వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామ పెద్ద పర్వతనేని శంకర్ పటేల్ (రామరాజు)‌ను ఎదురించి ప్రేమ వివాహం చేసుకోవాలని తన సోదరి డిసైడ్ అవుతుంది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సోదరి ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకొంటాడు. సోదరి ప్రేమించిన యువకుడిని కాకతీయ తోరణానికి కట్టి ఉట్టి కొట్టిస్తాడు. ఇక ముందు పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకొనే ప్రతీ ఒక్కరికి ఇలాంటి శిక్షే అంటూ శాసనం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన మేనకోడలు శైలు ( దీపాళీ శర్మ) పక్క ఊరికి చెందిన బాధ్యత అంటే తెలియని ఓ పోకిరి కరెంట్ రాజు (నరేన్ వనపర్తి)ని ప్రేమిస్తుంది. పీకల్లోతు ప్రేమలో ఉన్న శైలు, రాజు ఓ కారణంగా ఊరు విడిచి హైదరాబాద్‌కు పారిపోతారు. తండ్రి కరెంట్ నారాయణ ( ఆనంద చక్రపాణి) మాటలను పెడచెవిన పెట్టి కరెంట్ రాజు అల్లరి చిల్లరిగా ఎందుకు తిరిగాడు? 30 ఏళ్ల వయసులో కరెంట్ రాజు కాలేజీలో స్టూడెంట్‌గా ఎందుకు చేరాడు? కాలేజీలో సహ విద్యార్థిని శైలుతో ఎలా ప్రేమలో పడ్డాడు. శంకర్ పటేల్ గురించి తెలిసినా వారిద్దరు ప్రేమలో ఎలా మునిగిపోయారు? హైదరాబాద్‌కు పారిపోయిన కరెంట్ రాజు, శైలుకు ఎదురైన సమస్య ఏమిటి? శైలుకు ఎదురైన సమస్యను కరెంట్ రాజు ఎలా పరిష్కరించాడు? కరెంట్ రాజు, శైలు ప్రేమను శంకర్ పటేల్ అంగీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఊరికి ఉత్తరాన సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+