X
తెలుగు » సినిమాలు » ఊరికి ఉత్తరాన
ఊరికి ఉత్తరాన

ఊరికి ఉత్తరాన

Action | Romance | 19 Nov 2021 | U/A | 122 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఊరికి ఉత్తరాన స్టోరీ

ఊరికి ఉత్తరాన సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేన్ వనపర్తి, దీపాలి శర్మ, అంకిత కొయ్య, చక్రపాణి ఆనంద, రామరాజు  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సతీష్ పారంవేద వహించారు. నిర్మాత వనపర్తి వెంకటయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ అందించారు.  కథ  వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామ పెద్ద పర్వతనేని శంకర్ పటేల్ (రామరాజు)‌ను ఎదురించి ప్రేమ వివాహం చేసుకోవాలని తన సోదరి డిసైడ్ అవుతుంది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సోదరి ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకొంటాడు. సోదరి ప్రేమించిన యువకుడిని కాకతీయ తోరణానికి కట్టి ఉట్టి కొట్టిస్తాడు. ఇక ముందు పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకొనే ప్రతీ ఒక్కరికి ఇలాంటి శిక్షే అంటూ శాసనం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన మేనకోడలు శైలు ( దీపాళీ శర్మ) పక్క ఊరికి చెందిన బాధ్యత అంటే తెలియని ఓ పోకిరి కరెంట్ రాజు (నరేన్ వనపర్తి)ని ప్రేమిస్తుంది. పీకల్లోతు ప్రేమలో ఉన్న శైలు, రాజు ఓ కారణంగా ఊరు విడిచి హైదరాబాద్‌కు పారిపోతారు. తండ్రి కరెంట్ నారాయణ ( ఆనంద చక్రపాణి) మాటలను పెడచెవిన పెట్టి కరెంట్ రాజు అల్లరి చిల్లరిగా ఎందుకు తిరిగాడు? 30 ఏళ్ల వయసులో కరెంట్ రాజు కాలేజీలో స్టూడెంట్‌గా ఎందుకు చేరాడు? కాలేజీలో సహ విద్యార్థిని శైలుతో ఎలా ప్రేమలో పడ్డాడు. శంకర్ పటేల్ గురించి తెలిసినా వారిద్దరు ప్రేమలో ఎలా మునిగిపోయారు? హైదరాబాద్‌కు పారిపోయిన కరెంట్ రాజు, శైలుకు ఎదురైన సమస్య ఏమిటి? శైలుకు ఎదురైన సమస్యను కరెంట్ రాజు ఎలా పరిష్కరించాడు? కరెంట్ రాజు, శైలు ప్రేమను శంకర్ పటేల్ అంగీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఊరికి ఉత్తరాన సినిమా కథ.
Read More

ఊరికి ఉత్తరాన కాస్ట్ & క్రూ

ఊరికి ఉత్తరాన సిబ్బంది సమాచారం

దర్శకత్వం సతీష్ పారంవేద
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం భీమ్స్ సిసిరోలియో
నిర్మాత వనపర్తి వెంకటయ్య
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఊరికి ఉత్తరాన విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ప్రేమ, ఫ్యామిలీ, యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో తెరకెక్కిన చిత్రం ఊరికి ఉత్తరాన. తెలంగాణ వాతావరణం, యాస, భాష మిమల్ని ఆకట్టుకొంటుంది. పరువు, ప్రతిష్టతో కాదు ప్రేమతో బతకాలనే చక్కటి సందేశాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి ఫీల్‌ను ఊరికి ఉత్తరాన అందిస్తుంది. కొత్తవాళ్లు చేసిన తొలి ప్రయత్నం కాబట్టి లోపాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు అనే మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం.

ఊరికి ఉత్తరాన ట్రైలర్

Video Thumbnail

ఊరికి ఉత్తరాన సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఊరికి ఉత్తరాన

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+