twitter

    ఒరేయ్ బుజ్జిగా స్టోరి

    ఒరేయ్ బుజ్జిగా సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, హెబ్బ పటేల్, మాళవిక నాయర్న్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ కుమార్ కొండ వహించారు. కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనుప్ రుబెన్స్  అందించారు. 

    కథ

    శ్రీను అలియాస్ బుజ్జి (రాజ్‌ తరుణ్) కృష్ణవేణి (మాళవిక నాయర్) ఒకే ఊరికి చెందిన వాళ్లు. ప్రేమను దక్కించుకోవడానికి శ్రీను.. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కష్టంగా భావించిన కృష్ణవేణి ఒకే సమయంలో ఒకే ట్రైన్‌లో ఊరి నుంచి పారిపోతారు. ట్రైన్‌లో ఒకరికొకరు పరిచయం కాగా బుజ్జి తన పేరు శ్రీను అని, కృష్ణవేణి తన పేరు స్వాతి అని పరిచయం చేసుకొంటారు. వారిద్దరూ లేచిపోయారనే పుకారుతో శ్రీను, కృష్ణవేణి కుటుంబాల మధ్య చిచ్చు రేపుతుంది. హైదరాబాద్‌కు వెళ్లిన ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే ఈ క్రమంలో ఊర్లో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయనే విషయంతో కృష్ణవేణిని వెతికేందుకు శ్రీను ప్రయత్నిస్తుంటాడు. అయితే తన ఇమేజ్‌ను డామేజ్ చేసిన బుజ్జిగాడంటే కృష్ణవేణి కోపం పెంచుకొంటుంది. అయితే స్వాతిగా పరిచయమైన కృష్ణవేణికి, శ్రీనుగా పరిచయమైన బుజ్జిగాడికి మధ్య ప్రేమ పుడుతుంది. తన ప్రేయసి సృజన (హెబ్బా పటేల్)తో బుజ్జిగాడి ప్రేమ సక్సెస్ కాకపోవడానికి కారణమేమిటి? స్వాతియే కృష్ణవేణి శ్రీనుకు ఎలా తెలిసింది? శ్రీనుగా పరిచయమైన బుజ్జిగాడు గురించి కృష్ణవేణి ఎలా తెలుసుకొన్నది. బుజ్జిగాడుపై కోపం ఎలా తీరింది. చివరకు బుజ్జిగాడు, కృష్ణవేణి ఎలా కలుసుకొన్నారు? రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎలా సద్దుమణిగాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఒరేయ్ బుజ్జిగా సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie ఒరేయ్ బుజ్జిగా with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X