X
తెలుగు » సినిమాలు » ఒరేయ్ బుజ్జిగా
ఒరేయ్ బుజ్జిగా

ఒరేయ్ బుజ్జిగా

Comedy | 02 Oct 2020 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఒరేయ్ బుజ్జిగా స్టోరీ

ఒరేయ్ బుజ్జిగా సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, హెబ్బ పటేల్, మాళవిక నాయర్న్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ కుమార్ కొండ వహించారు. కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనుప్ రుబెన్స్  అందించారు.  కథ శ్రీను అలియాస్ బుజ్జి (రాజ్‌ తరుణ్) కృష్ణవేణి (మాళవిక నాయర్) ఒకే ఊరికి చెందిన వాళ్లు. ప్రేమను దక్కించుకోవడానికి శ్రీను.. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కష్టంగా భావించిన కృష్ణవేణి ఒకే సమయంలో ఒకే ట్రైన్‌లో ఊరి నుంచి పారిపోతారు. ట్రైన్‌లో ఒకరికొకరు పరిచయం కాగా బుజ్జి తన పేరు శ్రీను అని, కృష్ణవేణి తన పేరు స్వాతి అని పరిచయం చేసుకొంటారు. వారిద్దరూ లేచిపోయారనే పుకారుతో శ్రీను, కృష్ణవేణి కుటుంబాల మధ్య చిచ్చు రేపుతుంది. హైదరాబాద్‌కు వెళ్లిన ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే ఈ క్రమంలో ఊర్లో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయనే విషయంతో కృష్ణవేణిని వెతికేందుకు శ్రీను ప్రయత్నిస్తుంటాడు. అయితే తన ఇమేజ్‌ను డామేజ్ చేసిన బుజ్జిగాడంటే కృష్ణవేణి కోపం పెంచుకొంటుంది. అయితే స్వాతిగా పరిచయమైన కృష్ణవేణికి, శ్రీనుగా పరిచయమైన బుజ్జిగాడికి మధ్య ప్రేమ పుడుతుంది. తన ప్రేయసి సృజన (హెబ్బా పటేల్)తో బుజ్జిగాడి ప్రేమ సక్సెస్ కాకపోవడానికి కారణమేమిటి? స్వాతియే కృష్ణవేణి శ్రీనుకు ఎలా తెలిసింది? శ్రీనుగా పరిచయమైన బుజ్జిగాడు గురించి కృష్ణవేణి ఎలా తెలుసుకొన్నది. బుజ్జిగాడుపై కోపం ఎలా తీరింది. చివరకు బుజ్జిగాడు, కృష్ణవేణి ఎలా కలుసుకొన్నారు? రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎలా సద్దుమణిగాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఒరేయ్ బుజ్జిగా సినిమా కథ.
Read More

ఒరేయ్ బుజ్జిగా కాస్ట్ & క్రూ

ఒరేయ్ బుజ్జిగా సిబ్బంది సమాచారం

దర్శకత్వం విజయ్ కుమార్ కొండ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత కెకె రాధామోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఒరేయ్ బుజ్జిగా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కథలో కొత్తదనం, ఆసక్తికరమైన కథనం కనిపించని రొమాంటిక్ ప్రేమ కథ ఒరేయ్ బుజ్జిగా. దర్శకుడు విజయ్ కుమార్ కొండా రాసుకొన్న కథ, కథనాలు గత చిత్రాల మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయనే చెప్పవచ్చు. నాసిరకమైన సీన్లు, కామెడీ ప్రేమ కథకు అడ్డంకిగా మారాయి. కొంతలో కొంత యూత్‌ను ఆకట్టుకొనే కొన్ని అంశాలు ఉండటం కాస్త ఊరట. కథలో ఉండే ట్విస్టులను సరిగా తెరకెక్కించి ఉంటే ఒరేయ్ బుజ్జిగా మూవీ మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మారి ఉండేదనే అభిప్రాయం కలుగుతుంది.

ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్

Video Thumbnail

ఒరేయ్ బుజ్జిగా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఒరేయ్ బుజ్జిగా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+