పైసా సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, కేథరిన్, సిద్దికా, భరత్‌రెడ్డి, చరణ్‌రాజ్, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, ఆర్కే, తబర్, లోబో, రాజు శ్రీవాస్తవ తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు.
కథ
పాత బస్తీలోని షేర్వాణీ దుకాణంలో మోడల్ ప్ర'క్యాష్' (నాని)కి డబ్బంటే పిచ్చి. ఎలాగైనా కోటీశ్వరుడు అయిపోవాలనుకునే అతన్ని ఓ పేద ముస్లిం అమ్మాయి నూర్జహాన్ (కేథరిన్) ప్రేమిస్తుంది. అయితే డబ్బే ముఖ్యం అనుకునే ప్రకాష్ ఆమెను నిర్లక్ష్యం చేయటంతో ఆమె ఓ ముసలి షేక్ ని వివాహం చేసుకోవానికి సిద్దపడుతుంది. అది తెలిసిన ప్రకాష్ ఆమెను సేవ్ చేసే ప్రాసెస్ లో ఓ వెహికల్ తో పారిపోతాడు. ఆ వెహికల్ లో ఓ మినిస్టర్ (చరణ్ రాజ్) ఎన్నికల కోసం పంపిన హవాలా డబ్బు 50 కోట్లు ఉంటుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరిగుతుంది. చివరకు నూర్జహాన్ ప్రేమను ఒప్పుకున్నాడా... ఆ డబ్బు ఏమైంది అనేది మిగతా కథ.