పాండవులు పాండవులు తుమ్మెద సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ,రవీనా టండన్, హన్సిక, ప్రణీత తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీవాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్ నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకులు బోప్ప లహరి, అచ్చు కలసి స్వరాలు సమకుర్చారు.
కథ
స్టోరీలైన్ వివరాల్లోకి వెళితే..నాయుడు(మోహన్ బాబు) బ్యాంకాక్‌లో టూరిస్ట్ గైడ్. అతనకి ముగ్గురు దత్తపుత్రులు అజయ్(మనోజ్), వరుణ్ సందేశ్, లక్కీ(తనీష్). అదే సిటీలో ఉండే రవీనాకు ఇద్దరు దత్తపుత్రులు విజ్జు(విష్ణు), వెన్నెల కిషోర్. మోహన్ బాబు, రవీనా టండన్ కొడుకుల మధ్య ఓ విషయంలో గొడవ జరుగుతుంది. తన కొడుకులతో గొడవ పడ్డవారి సంగతి తేల్చేందుకు రవీనా ఇంటికి వెళతాడు మోహన్ బాబు. కట్ చేస్తే....మోహన్ బాబు, రవీనా గతంలో విడిపోయిన ప్రేమికులు. చాలా కాలం తర్వాత కలిసిన వీరు గతాన్ని మరిచిపోయి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లికి ఇరువురు తమ కుమారులను కూడా ఒప్పిస్తారు. ఇలా సంతోషంగా సాగిపోతున్న వీరి ఫ్యామిలీ స్టోరీలో విజ్జు ప్రేమిస్తున్న హనీ(హన్సిక) కిడ్నాప్‌కు గురవుతుంది. హనీని ఎవరు కిడ్నాప్ చేసారు. ఆమె గతం ఏమిటి? విజ్జు తన ఫ్యామిలీతో కలిసి ఆమెను ఎలా దక్కించుకున్నాడు అనేది తర్వాతి కథ