పందెం కోడి 2 (2018)(U/A)
Release date
18 Oct 2018
genre
పందెం కోడి 2 స్టోరి
పందెం కోడి సినిమా యాక్షన్, ఫ్యామిలి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశాల్ కృష్ణన్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాజ్ కిరణ్, అర్జై, గంజ కరుప్పు, రామ్ దాస్, హరీష్ పెరడి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎన్ లింగుస్వామి వహించారు మరియు నిర్మాత విశాల్ కృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.
కథ
కడప ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య వర్గపోరులో భవానీ (వరలక్ష్మీ శరత్ కుమార్) తన భర్తను కోల్పోతుంది. తన భర్తకు కారణమైన వారి వంశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొంటుంది. గొడవ కారణంగా వీరభద్రుడి జాతర ఏడేళ్లుగా ఆగిపోతుంది. ఆ జాతరను జరిపిస్తే రాయలసీమలో వర్షాలు పడి కరువు తగ్గుతుందనే ఆలోచనతో రాజారెడ్డి (రాజ్ కిరణ్) ఆ కార్యాన్ని భుజానికి ఎత్తుకొంటాడు. ఏ జాతరలోనైతే తన పసుపు, కుంకుమలు దూరమయ్యాయో అదే కార్యక్రమంలో తన పగను చల్లార్చుకోవాలనుకొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజారెడ్డి కుమారుడు బాలు (విశాల్) విదేశీ చదువులు ముగించుకొని వస్తారు. ఊర్లో అల్లరి పిల్ల చారుమతి (కీర్తి సురేష్) ప్రేమలో పడుతాడు. ఈ క్రమంలో ప్రత్యర్థుల దాడిలో రాజారెడ్డి గాయపడుతాడు. దాంతో జాతరను పూర్తి చేసే బాధ్యత బాలుపై పడుతుంది. ఓ కారణంగా చారుమతి ప్రేమను బాలు నిరాకరిస్తాడు. చారుమతి ప్రేమను బాలు ఎందుకు నిరాకరించాడు? భవానీ తన పంతాన్ని నెగ్గించుకొందా? జాతరను ముగించే క్రమంలో బాలుకు ఎదురైన సమస్యలేంటి? గాయాల బారిన పడిన తన తండ్రి ప్రతిష్ఠను బాలు ఎలా కాపాడగలిగాడు. చారుమతి ప్రేమను బాలు ఎలా గెలుచుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే పందెం కోడి 2 సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie పందెం కోడి 2 with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు