పరుగు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, షీలా, ప్రకాష్ రాజ్, పూనం బజ్వా, సునీల్, సుబ్బరాజు, జయసుధ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, జీవా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్కీన్ ప్లే ,దర్శకత్వం :భాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
ఓ పల్లెటూరు పెద్దాయన(ప్రకాష్ రాజ్) పెద్దకూతురు (పూనం బజ్వా) పెళ్ళి జరుగుతూంటూంది. కాస్సేపటికి ఆమె తన ప్రియుడు(ఆ ఊరిలో పొలం పనులు చేసుకుని బ్రతికే కుటుంబంలోని కుర్రాడు) తో జంప్. దాంతో హర్ట్ అయిన ఆమె తండ్రి కూతురు కోసం వేట ప్రారంభిస్తాడు. ఆ కుర్రాడి ప్రెండ్స్ ని తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేస్తాడు. వాళ్ళలో కృష్ణ (అల్లు అర్జున్) అనే హుషారైన హైదరాబాద్ కుర్రాడుంటాడు. అతను ఈ హడావిడిలో పెద్దాయన మరో కూతురు మీనా(షీలా) తో ప్రేమలో పడతాడు. ఆమెని లేపుకు పోదామనుకుంటాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకుందా? అసలే కోపంలో ఉన్న పెద్దాయన ఈ సారేం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే.