X
పఠాన్
Action | 25 Jan 2023 | U/A | 146 Mins
Telugu

పఠాన్ స్టోరీ

పఠాన్ సినిమా యాక్షన్-థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో షారుక్ ఖాన్, దీపికా పదుకునే, జాన్ అబ్రహం, దింపులే కపాడియా తదితరులు నటిస్తున్నారు, సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడు.ఈ సినిమాకి దర్శకత్వం సిద్దార్థ్ ఆనంద్ వహిస్తున్నారు.   

కథ
పఠాన్ (షారుక్ ఖాన్) ఇండియాలో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (Raw) ఏజెంట్‌. వివిధ దేశాల్లో దేశానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలను చేధించడానికి ఇండియా తరఫున ఆపరేషన్స్‌కు నాయకత్వం వహిస్తుంటాడు. భారత సైన్యంలో పనిచేసే జిమ్ (జాన్ అబ్రహం) పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత. అయితే ఓ సంఘటన కారణంగా భారత్‌పై ద్వేషం పెంచుకొని.. పాకిస్థాన్‌తో చేతులు కలుపుతాడు. ఇక రుబీనా ఖాన్ (దీపిక పదుకోన్ పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్. ఓ మిషన్‌ కోసం పారిస్ వెళ్లిన షారుక్‌ను బుట్టలో వేసుకొని రుబీనా మోసం చేస్తుంది. ఈ క్రమంలో జిమ్, దీపిక కలిసి భారత్‌కు వ్యతిరేకంగా రక్త బీజ్ అనే కాన్సెప్ట్‌తో బయోలాజికల్ వార్ చేపట్టారనే విషయం పఠాన్‌కు తెలుస్తుంది. భారత సైన్యంలో పనిచేసే జిమ్ దేశానికి వ్యతిరేకంగా ఎలా మారాడు. ఎలాంటి సంఘటన దేశంపై జిమ్ విద్వేషం పెంచుకొనే పరిస్థితికి దారి తీసింది. ఐఎస్ఐ ఏజెంట్ అయిన రుబీనా పఠాన్‌ను ప్రేమ పేరుతో బుట్టలో వేసుకొన్నది. అసలు రక్త‌బీజ్ కాన్సెప్ట్ ఏమిటి? జిమ్ చేపట్టిన రక్త బీజ్ బయోలాజికల్ వార్ కుట్ర ఏమిటి? రక్త బీజ్ ఆపరేషన్‌తో భారత్‌ను జిమ్ ఎలా సర్వనాశనం చేయాలనుకొన్నాడు? పాకిస్థాన్‌కు చెందిన రుబీనా ఇండియాకు ఎందుకు సహాయం చేయాలని అనుకొంటుంది. రక్త్ బీజ్ ఆపరేషన్‌ను పఠాన్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడా? ఈ కథలో టైగర్ (సల్మాన్ ఖాన్) పాత్ర ఏమిటి? పఠాన్‌కు కబీర్ ఎలాంటి సహాయం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే పఠాన్ సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+