పిల్లా జమిందార్ సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, హరి ప్రియ, బింధు మాధవి, అవసరాల శ్రీనివాస్, రావు రమేష్, ఎం.ఎస్ నారాయణ, శివప్రసాద్, వెన్నెల కిషోర్, సమీర్ , నాగినీడు, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి అశోక్ నిర్వహించారు మరియు నిర్మాతలు డి ఎస్ రావు, ఎస్ ఎస్ బుజ్జి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సెల్వ గణేష్ స్వరాలు సమకుర్చారు.
కథ
జమిందారీ కుటుంబంలో పుట్టిన కుర్రాడు పిజె(నాని). కోపిష్టి మాత్రమే కాదు విపరీతమైన అహంభావి.. పైగా బేవార్సు. రూ. 5 వేల కోట్లకు ఒక్కగానొక్క వారసుడు. అయితే పిజె మేజర్ అయిన తర్వాతనే ఆ ఆస్తి దక్కేలా వీలునామా రాస్తాడు వాళ్ల తాత(నాగినీడు). మేజర్ కాగానే సరిపోదు, అందుకు కొన్ని కండీషన్లు కూడా పెడతాడు. అందులో ముఖ్యమైన కండీషన్ పిజె మూడు సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేయాలి. అయితే బేవార్సుగా తిరిగే పీజేకి ఈ షరతులంటే అస్సలు పడవు. మరి ఆస్తి దక్కించుకోవాలి కాబట్టి వీలునామా కండీషన్ల ప్రకారం సిరిపురం గ్రామంలో మిలటరీ రాజన్న(రావు రమేష్) హాస్టల్ లో ఉంటూ, మంగమ్మ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదువుకోవడానికి బయలుదేరుతాడు పిజె. వీలునామా కండీషన్లులో నెగ్గడం బేవార్సు పిజె వల్ల అవుతుందా? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే థియేటర్లదాకా వెళ్లాల్సిందే.