పవర్ స్టార్ సినిమా పొలిటికల్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో ప్రధాన పాత్రలో చల్లకొటి నరేష్, మహేష్ కత్తి, ధనంజయ్ ప్రభుణే రామ్ గోపాల్ వర్మ ఇంకా తదితరులు నటించారు. దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ వహించారు. సంగీతం : డీఎస్ఆర్ సినిమాటోగ్రఫీ : జోషి నిర్మాణ సంస్థ : ఆర్జీవీ వరల్డ్ థియేటర్
కథ
ప్రవన్ కళ్యాణ్ అనే ఓ సినిమా స్టార్ మన సేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతాడు. పోటిన చేసిన రెండు చోట్లా ఓడిపోవడం, పార్టీకి ఒక్క సీటు రావడంతో ఫలితాలు వచ్చిన రాత్రి కుంగిపోతాడు. ఇక ప్రవన్ కళ్యాణ్‌ను ఆయన పెద్దన్న, చిన్నన్న, ఆప్త మిత్రుడు టీఎస్, భక్తుడు గుండ్ల రమేష్, బాబు వచ్చి మాట్లాడుతారు, ఓదార్చుతారు, తిడతారు. చివరగా తన తదుపరి కార్యాచరణ ఏంటో పాలుపోకుండా ఉన్న ప్రవన్ కళ్యాణ్‌కు ఓ వీరాభిమాని వచ్చి సలహాలు, సూచనలు, హితబోధన చేస్తాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరని తెలియాలంటే పవర్ స్టార్ చూడాల్సిందే.