twitter

    ప్రతి రోజు పండగే స్టోరి

    ప్రతి రోజు పండగే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం మారుతి వహించారు. బన్ని వాసు, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు అందించారు.  

    కథ

    పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడటంతో రాజమండ్రిలో రఘురామయ్య (సత్యరాజ్) తన శేష జీవితాన్ని గడుపుతుంటాడు. ఆ క్రమంలో ఆయన ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌కు లోనవుతాడు. ఇదిలా ఉండగా అమెరికాలో వ్యాపారవేత్త రఘురామయ్య కుమారుడు రమేష్ (రావు రమేష్)‌కు తన కుమారుడు సాయి (సాయిధరమ్ తేజ్) అంటే పంచప్రాణాలు. క్షణం కూడా సాయి లేకుండా ఉండలేరు. ఇలాంటి క్రమంలో తాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తండ్రిని వదిలేసి సాయి రాజమండ్రికి చేరుకొంటాడు. నాలుగు వారాల్లో చనిపోయే తాత కోసం సాయి ఏం చేశాడు? డబ్బే సర్వస్వంగా భావించే రాఘు రామయ్య ముగ్గురు కొడుకులు, కూతురు తండ్రి ప్రాణాంతక వ్యాధి పట్ల ఎలా స్పందించారు? తమ బిజీ షెడ్యూల్‌లో మానవ సంబంధాలు మరిచిన కొడుకులు, కూతుళ్లు ఎలా ప్రవర్తించారు? తాత చివరి కోరికలను సాయి తీర్చాడా? జన్మనిచ్చిన తండ్రిని కూడా మరిచిన కొడుకులు, కూతుళ్లకు (తండ్రి, బాబాయ్‌లు, పిన్ని)కి సాయి ఏ విధంగా బుద్ది చెప్పారు? ఇలాంటి ఎమోషనల్ కథలో టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్న (రాశీఖన్నా)తో సాయి రొమాంటిక్ లవ్ ట్రాక్ ఎలా ఉంది. సింక్ బ్రదర్ రాజేశ్, అజయ్ విలనిజం పండిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రతి రోజు పండగే సినిమా కథ.


    **Note:Hey! Would you like to share the story of the movie ప్రతి రోజు పండగే with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X