X
తెలుగు » సినిమాలు » ప్రతి రోజు పండగే
ప్రతి రోజు పండగే

ప్రతి రోజు పండగే

Romance | 20 Dec 2019 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ప్రతి రోజు పండగే స్టోరీ

ప్రతి రోజు పండగే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం మారుతి వహించారు. బన్ని వాసు, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు అందించారు.   కథ పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడటంతో రాజమండ్రిలో రఘురామయ్య (సత్యరాజ్) తన శేష జీవితాన్ని గడుపుతుంటాడు. ఆ క్రమంలో ఆయన ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌కు లోనవుతాడు. ఇదిలా ఉండగా అమెరికాలో వ్యాపారవేత్త రఘురామయ్య కుమారుడు రమేష్ (రావు రమేష్)‌కు తన కుమారుడు సాయి (సాయిధరమ్ తేజ్) అంటే పంచప్రాణాలు. క్షణం కూడా సాయి లేకుండా ఉండలేరు. ఇలాంటి క్రమంలో తాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తండ్రిని వదిలేసి సాయి రాజమండ్రికి చేరుకొంటాడు. నాలుగు వారాల్లో చనిపోయే తాత కోసం సాయి ఏం చేశాడు? డబ్బే సర్వస్వంగా భావించే రాఘు రామయ్య ముగ్గురు కొడుకులు, కూతురు తండ్రి ప్రాణాంతక వ్యాధి పట్ల ఎలా స్పందించారు? తమ బిజీ షెడ్యూల్‌లో మానవ సంబంధాలు మరిచిన కొడుకులు, కూతుళ్లు ఎలా ప్రవర్తించారు? తాత చివరి కోరికలను సాయి తీర్చాడా? జన్మనిచ్చిన తండ్రిని కూడా మరిచిన కొడుకులు, కూతుళ్లకు (తండ్రి, బాబాయ్‌లు, పిన్ని)కి సాయి ఏ విధంగా బుద్ది చెప్పారు? ఇలాంటి ఎమోషనల్ కథలో టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్న (రాశీఖన్నా)తో సాయి రొమాంటిక్ లవ్ ట్రాక్ ఎలా ఉంది. సింక్ బ్రదర్ రాజేశ్, అజయ్ విలనిజం పండిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రతి రోజు పండగే సినిమా కథ.
Read More

ప్రతి రోజు పండగే కాస్ట్ & క్రూ

ప్రతి రోజు పండగే సిబ్బంది సమాచారం

దర్శకత్వం మారుతి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత బన్ని వాసు, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ప్రతి రోజు పండగే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు, అనుబంధాల నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం ప్రతి రోజు పండగే. ఎమోషనల్ అంశాలు, వినోదం, కమర్షియల్ అంశాలు సినిమాకు బలం. మారుతి దర్శకత్వ ప్రతిభ, సాయిధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్, సత్యరాజ్, రావు రమేష్‌, మురళీశర్మ యాక్టింగ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తే కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.

ప్రతి రోజు పండగే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ప్రతి రోజు పండగే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+