ప్రేమ జంట సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ ప్రణీత్, సుమయ, ఉత్తేజ్, రాజా రవీంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నిఖిలేష్ తోగరి వహించారు
కథ
చందు (రామ్ ప్రణీత్), నందు (సుమయ) కాలేజీ విద్యార్థులు. మైనర్లయిన ఈ ఇద్దరు ప్రేమలో పడుతారు. పెద్దలు ప్రేమను వ్యతిరేకించడంతో చందు, నందు ఇద్దరు లేచిపోవాలని డిసైడ్ అవుతారు. పారిపోతున్న సమయంలో అల్లరి మూకల చేతిలో చందు మానభంగ ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలో నందు, చందు పోలీసులకు సేఫ్‌గా చిక్కడంతో మళ్లీ ఇంటికి చేరుతారు. చందు ప్రేమను నిరాకరించిన తండ్రి ఆమెకు పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో పెళ్లి పీటల మీద నుంచి పరారై హైదరాబాద్‌కు చేరుకొంటారు. చందును బురిడీ కొట్టించి నందును వేశ్యవాటికలకు ఓ వ్యక్తి (షఫీ) అమ్మేస్తాడు. వ్యభిచార కూపం నుంచి నందు ఎలా బయటపడింది? హైదరాబాద్‌కు చేరిన ఈ ప్రేమ జంట ఎలాంటి కష్టాలను అనుభవించింది? చందు, నందు ప్రేమ కథకు ఎలాంటి ముగింపు లభించిందిఝ తన ప్రేమను గెలిపించుకొన్నారా? త్యాగం చేశారా? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమ జంట కథ.