రాజావారు రాణిగారు (2019)(U/A)
Release date
29 Nov 2019
genre
రాజావారు రాణిగారు స్టోరి
రాజావారు రాణిగారు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కిరణ్ అబ్బావరం, రహస్య గోరక్ , రాజ్ కుమార్ కశిరెడ్డి, యజుర్వేద్, స్నేహమధురి శర్మ, దివ్య నార్ని, కిట్టయ్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవి కిరణ్ కోలా వహించారు మరియు నిర్మాత మనోవికాష్ డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జై క్రిష్ అందించారు.
కథ
శ్రీరామపురం అనే గ్రామంలో రాజా (కిరణ్ అబ్బవరం), రాణి (రహస్య గోరక్)ని బాల్య స్నేహితులు. చిన్నతనం నుంచే రాణిపై రాజా ఇష్టాన్ని పెంచుకొంటాడు. అయితే ఆ తన మనసులోని విషయాన్ని మాత్రం చెప్పలేకపోయి మౌన ప్రేమికుడిగా మారిపోతాడు. ఓ క్రమంలో తన ప్రేమ విషయాన్ని రాణికి చెప్పడానికి అతని స్నేహితులు చౌదరి (రాజ్‌కుమార్ కసిరెడ్డి), నాయుడు (యజుర్వేద్ గుర్రం) సహాయం తీసుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మనసులోని మాటను మాత్రం చెప్పలేకపోతాడు. ఉన్నత చదువుల కోసం ఊరు విడిచి వెళ్లిన రాణి.. మూడున్నరేళ్లైనా తిరిగి రాదు. అయితే ఆమెను మళ్లీ ఊరికి రప్పించడానికి హీరో చేసిన ప్రయత్నాలు, వచ్చాక తన మనసులోని మాట చెప్తాడా? లేదా అన్నదే కథ.
**Note:Hey! Would you like to share the story of the movie రాజావారు రాణిగారు with us? Please send it to us ([email protected]).