రాజా విక్రమార్క సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు నటించారు. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ ఫస్ట్ మూవీగా తెరకెక్కించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. ఈ సినిమాను రామారెడ్డి నిర్మించారు.
కథ
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందాన్ని లీడ్ చేసే అధికారి (తనికెళ్ల భరణి) విక్రమ్ ( గుమ్మకొండ కార్తీకేయ) టీమ్ మెంబర్. హోంమంత్రి ఇంటిలో అండర్ కవర్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఆ క్రమంలో హోం మంత్రి కూతురు కాంతి (తాన్యా)తో ప్రేమలో పడుతాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలనుకొనే టెర్రిరిస్టులపై దాడి చేస్తారు. కీలక టెర్రరిస్టు వద్ద కుట్రకు సంబంధించిన సగం సమాచారాన్ని తీసుకొని చంపేస్తాడు. NIAలో కొత్తగా జాయిన్ అయిన విక్రమ్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? క్రమశిక్షణ లేకపోవడం వలన విక్రమ్ ఎలా ఇబ్బంది పడ్డాడు? ఓ ఆయుధాల అమ్మకాలు సాగించే డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేయడం వల్ల విక్రమ్ ఎలాంటి ఛాలెంజ్‌ను ఎదుర్కొన్నాడు? మిగతా ఇన్ఫర్మేషన్ సంగతేంటి? ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.