రాజా సినిమా రోమ్యాంటిక్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, సౌందర్య, అబ్బస్, చంద్ర మోహన్, సుధాకర్, తనికెళ్ల భరణి, బ్రహ్మనందం ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ముప్పలనేని శివా నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ బి చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజుకుమార్ స్వరాలు సమకుర్చారు.
కథ
రాజ (వెంకటేష్) తన స్నేహితుడు సుధాకర్ చాలా సరదాగా చిన్నా చిన్నా దొంగతనాలు చేస్తువుంటారు...ఒక రోజు వినాయక విగ్రహాని దోంగలించి పోలీసుల నుంచి తప్పించుకోబోయి దారి ప్రక్కనే వున్నా ఒక ఇంట్లోకి వెళ్తారు..ఆ ఇంట్లో కోంత మంది పిల్లలుతో పాటు అందమైన అమ్మాయి(సౌందర్య) ఉంటుంది. రాజ ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు..అక్కడ నుండి తను ప్రేమించిన అమ్మాయి కళను ఎలా నేరవేర్చుతాడు అలాగే తన ప్రేమను ఎలా తేలియజేస్తాడు అనేది మిగతా కథా..