రాజన్న సినిమా డ్రామ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, స్నేహ, బేబీ అని, శ్వేతామీనన్, నాజర్, అజయ్, సుప్రీత్, ప్రదీప్‌రావత్, ముఖేష్‌రుషి, రవి కాలే, హేమ, శకుంతల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయేంద్రప్రసాద్ నిర్వహించారు మరియు నిర్మాత అక్కినేని నాగార్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అదిలాబాద్ జిల్లా నేలకొండపల్లిలో దొరసాని(శ్వేతా మీనన్)దౌర్జన్య పాలన నడుస్తూంటుంది. ఆ పల్లెల్లో ఉన్న చిన్నారి మల్లమ్మ (బేబి ఆనీ) తన పాటతో అక్కడ జనాల్ని చైతన్యవంతులను చేస్తూంటుంది. అది గిట్టని దొరసాని మల్లమ్మపై పగ పట్టి వెంటపడుతుంది. ఈ నేఫద్యంలో దొరసానికి ఆ పాప మరెవరో కాదు తమ దొరల పాలనను అంతం చేసే పనిలో మరణించిన రాజన్న(నాగార్జున)అనే పోరాట యోధుడు కూతురని నిజం తెలుస్తుంది. దాంతో రక్తం మరిగిన ఆమె..ఈ చిన్నారి మల్లమ్మనిచంపటానికి రెడీ అవుతుంది. ఈలోగా మల్లమ్మకు కూడా తను రాజన్న కూతురనని అనే నిజం తెలుస్తుంది.ఈ లోగా ఆ దొరసాని నుంచి తప్పించుకున్న మల్లమ్మ ఆ ఊరుని దొరల పాలన నుంచి తప్పించటానకి ప్రధాని నెహ్రూని కలవాలని డిల్లీకి కాలనడకన బయిలుదేరుతుంది. ఈ లోగా అస్సలు తన తండ్రి రాజన్న ఎంత గొప్పవాడు అనే విషయాలు తెలుసుకుంటుంది. చివరకు మల్లమ్మతన లక్ష్యం నెరవేర్చుకుందా..దొరసాని ఏమైంది అనే విషయాలు తెరపై చూడాల్సిందే.