X
రాక్షసుడు 2015
Action | Thriller | 29 May 2015 | U |
Telugu

రాక్షసుడు 2015 స్టోరీ

రాక్షసుడు సినిమా యాక్షన్ రోమ్యాంటి థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య, నయనతార, ప్రణిత, జయరామ్, ప్రేమ్జి అమరన్, పార్తిబం, పి శముతిరకణి, కరుణ్, శ్రీమన్, సంజయ్ భారతి, విద్యుల్లేఖ, రియాజ్ ఖాన్ తదితరులు ముఖ్యాపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకట్ ప్రభు నిర్వహించారు మరియు నిర్మాత జ్నానవేల్ రాజ కె ఇ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చారు.

కథ

మధుసూదన్ అలియాస్ మాస్ (సూర్య), జెట్ (ప్రేమ్ జీ) ఇద్దరూ చిల్లర దొంగలు. మెసాలు, దొంగతనాలు చేసుకుంటూ జీవితం గడువుతుంటారు. నర్సుగా పని చేస్తున్న మాలిని(నయనతార)ను మాస్ ప్రేమిస్తూ ఉంటారు. ఆమెకు డబ్బు అవసరం కావడంతో ఓ రోజు దొంగతనం చేయబోగా...అపుడు జరిగిన ప్రమాదంలో ప్రేమ్ జీ చనిపోతాడు. దాంతో సూర్య డల్ అయిపోతాడు. తర్వాత కొద్ది రోజులుకు అతనికి ప్రేమ్ జీ కనపడటం ప్రారంభిస్తాడు. అప్పుడు సూర్యకు అర్దమవుతుంది...తనకు దెయ్యాలను చూసే పవర్ వచ్చిందని. ఈ విషయ తెలిసి దెయ్యాలు అతని వెంట పడుతుంటాయి. తమ తీరని కోరికలు, సమస్యలు తీర్చాలని, తమ ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలని అతన్ని కోరుతాయి. సూర్య దొంగతనాలు ఆపేసి...ఆ దెయ్యాలను రకరకాల ఇళ్లకు పంపి....జనాలను భయ పెడుతూ...వాటిని తరిమేస్తున్నట్లు గేమ్ ఆడుతూ డబ్బు సంపాదిస్తూంటాడు. అయితే ఓ రోజు ఓ దెయ్యాన్ని ఓ ఇంటినుంచి తరుముదామని వెళితే అక్కడ షాక్ కు గురి అవుతాడు. అక్కడ ఉన్న దెయ్యం...అచ్చం అతని పోలికలోనే ఉంటుంది. ఆ దెయ్యం పేరు శివ(సూర్య మరో పాత్ర). శివ ఎదురు పడ్డాక మాస్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. అసలు ఈ దెయ్యాలు గోల ఏంటి...తన పోలికలతోనే ఉన్నవాడు ఎవరు అనేది తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+