X
తెలుగు » సినిమాలు » రాక్షసుడు 2015
రాక్షసుడు 2015

రాక్షసుడు 2015

Action | Thriller | 29 May 2015 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

రాక్షసుడు 2015 స్టోరీ

రాక్షసుడు సినిమా యాక్షన్ రోమ్యాంటి థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య, నయనతార, ప్రణిత, జయరామ్, ప్రేమ్జి అమరన్, పార్తిబం, పి శముతిరకణి, కరుణ్, శ్రీమన్, సంజయ్ భారతి, విద్యుల్లేఖ, రియాజ్ ఖాన్ తదితరులు ముఖ్యాపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకట్ ప్రభు నిర్వహించారు మరియు నిర్మాత జ్నానవేల్ రాజ కె ఇ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చారు. కథ మధుసూదన్ అలియాస్ మాస్ (సూర్య), జెట్ (ప్రేమ్ జీ) ఇద్దరూ చిల్లర దొంగలు. మెసాలు, దొంగతనాలు చేసుకుంటూ జీవితం గడువుతుంటారు. నర్సుగా పని చేస్తున్న మాలిని(నయనతార)ను మాస్ ప్రేమిస్తూ ఉంటారు. ఆమెకు డబ్బు అవసరం కావడంతో ఓ రోజు దొంగతనం చేయబోగా...అపుడు జరిగిన ప్రమాదంలో ప్రేమ్ జీ చనిపోతాడు. దాంతో సూర్య డల్ అయిపోతాడు. తర్వాత కొద్ది రోజులుకు అతనికి ప్రేమ్ జీ కనపడటం ప్రారంభిస్తాడు. అప్పుడు సూర్యకు అర్దమవుతుంది...తనకు దెయ్యాలను చూసే పవర్ వచ్చిందని. ఈ విషయ తెలిసి దెయ్యాలు అతని వెంట పడుతుంటాయి. తమ తీరని కోరికలు, సమస్యలు తీర్చాలని, తమ ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలని అతన్ని కోరుతాయి. సూర్య దొంగతనాలు ఆపేసి...ఆ దెయ్యాలను రకరకాల ఇళ్లకు పంపి....జనాలను భయ పెడుతూ...వాటిని తరిమేస్తున్నట్లు గేమ్ ఆడుతూ డబ్బు సంపాదిస్తూంటాడు. అయితే ఓ రోజు ఓ దెయ్యాన్ని ఓ ఇంటినుంచి తరుముదామని వెళితే అక్కడ షాక్ కు గురి అవుతాడు. అక్కడ ఉన్న దెయ్యం...అచ్చం అతని పోలికలోనే ఉంటుంది. ఆ దెయ్యం పేరు శివ(సూర్య మరో పాత్ర). శివ ఎదురు పడ్డాక మాస్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. అసలు ఈ దెయ్యాలు గోల ఏంటి...తన పోలికలతోనే ఉన్నవాడు ఎవరు అనేది తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.
Read More

రాక్షసుడు 2015 కాస్ట్ & క్రూ

రాక్షసుడు 2015 సిబ్బంది సమాచారం

దర్శకత్వం వెంకట్ ప్రభు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం యువన్‌శంకర్‌రాజా
నిర్మాత జ్ఞానవేల్‌ రాజ కె ఇ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రాక్షసుడు 2015 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పెర్ఫార్మెన్స్ పరంగా సూర్య ఇటు మాస్ పాత్రలోనూ, అటు దెయ్యం పాత్రలోనూ అదరగొట్టాడు. సినిమా మొత్తానికి సూర్య వన్ మెన్ షో అని చెప్పొచ్చు. మొదటి క్యారెక్టర్ మాస్ - ఇందులో సూర్య ఒక కన్నింగ్ ఫెలోగా మంచి హావభావాలను పలికించాడు. ఈ పాత్ర మాస్ ఆడియన్సుకు ఆకట్టుకునే విధందా ఉంటుంది. రెండవ క్యారెక్టర్ శివ - ఈ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. అందులో సూర్య క్లాస్ లుక్ విత్ పోనీ టెయిల్ అండ్ పెర్ఫార్మన్స్ చాలా డీసెంట్ గా ఉంది. నయనతార పాత్రను సినిమాలో జస్ట్ ఒక గ్లామర్ కోసమే వాడుకున్నారు. ఆమె లుక్ బావుంది. ఆమె పాత్రకు పెర్ఫార్మెన్స్ పరంగా అవకాశం లేకున్నా ఉన్నంతలో ఆకట్టుకుంది. ప్రణిత చాలా చిన్న రోల్ చేసింది, ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేసింది. ప్రేంజీ అమరేన్ సినిమా అంతా ట్రావెల్ అవుతూ అక్కడక్కడా నవ్వించాడు.

రాక్షసుడు 2015 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రాక్షసుడు 2015

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+