twitter

    రక్త చరిత్ర 2 స్టోరి

    రక్త చరిత్ర 2 సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వివేక్ ఒబెరాయ్, రాధిక అప్టే, ప్రియమణి, సూర్య, శత్రుఘ్న సిన్హా, సుదీప్, అభిమన్యు సింగ్ తదితరులు ముక్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత: మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్,చిన్న వాసుదేవ రెడ్డి, రాజ్ కుమార్ అందరు కలిసి సంయుక్తంగా నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ధరమ్ సందీప్ స్వరాలు సమకుర్చారు.

    కథ

    "చరిత్ర ఎప్పుడూ కొత్తగా తయారు కాదు...అది ఎప్పుడు అవే సంఘటనలతో పునరావృతం అవుతూంటుది" అన్నది నానుడి. ఇదే పాయింటుని అనుసరిస్తూ ఈ సెకెండా పార్ట్ కథనం కొనసాగుతుంది. ప్రతాప్ రవి (వివేక్ ఒబరాయ్)తన తండ్రిని చంపారని పగతో చేసిన హత్యతో తనలాంటి మరో వ్యక్తిలో పగకి ప్రాణం పోసానని ఆలస్యంగా తెలుసుకుంటాడు. అతనెవరో కాదు ప్రతాప్ రవి మొదట చంపిన నరసింహరెడ్డి కొడుకు సూర్యభాను రెడ్డి అలియాస్ సూర్య (తమిళ హీరో సూర్య). అయితే సూర్య...తన తండ్రిని ప్రతాప్ చంపాడని తెలసినా మొదట పగ, ప్రతీకారాలే జీవితం కాదని వాటికి దూరంగా బ్రతుకుదామనుకుని నిర్ణయించుకుంటాడు. అయితే రక్త చరిత్ర అతన్ని పగవైపే మళ్ళిస్తుంది. ప్రతాప్ పెట్టిన టీవీ బాంబుతో తన తల్లి, తమ్ముడు, చెల్లి చచ్చిపోయారని తెలుసుకున్న సూర్య రగిలిపోయి..ప్రతాప్ ని చంపాలని బయిలుదేరతాడు. అయితే అది నెరవేరక పోలీసులకు లొంగిపోయి..జైలులోంచే ప్రతాప్ చావుకు ప్లాన్ చేస్తాడు.దానకి జైల్లోనే పరిచయమైన కిరాయి హంతకుడు ముద్దుకృష్ణ సాయిపడతాడు..అంతేగాక రాజకీయంగానూ దెబ్బ కొట్టాలని తన భార్య భార్యభవాని (ప్రియమణి)ని ప్రతాప్ కు పోటిగా ఎలక్షన్లలో నిలబెడతారు. అప్పుడు ప్రతాప్..తనకు అడ్డమవుతున్న సూర్య భార్యని చంపాలనుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది. సూర్య తన భార్యని రక్షించుకోగలిగాడా...ప్రతాప్ ని చంపటమే తన జీవత ధ్యేయమనే సూర్య కోరిక తీరిందా అనేది తెరపై చూడాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie రక్త చరిత్ర 2 with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X