X
తెలుగు » సినిమాలు » రక్త చరిత్ర 2
రక్త చరిత్ర 2

రక్త చరిత్ర 2

Action | 03 Dec 2010 | A |
Telugu

2.9 /5 Users

2 /5 Filmibeat

రక్త చరిత్ర 2 స్టోరీ

రక్త చరిత్ర 2 సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వివేక్ ఒబెరాయ్, రాధిక అప్టే, ప్రియమణి, సూర్య , శత్రుఘ్న సిన్హా, సుదీప్, అభిమన్యు సింగ్ తదితరులు ముక్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత: మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్,చిన్న వాసుదేవ రెడ్డి, రాజ్ కుమార్ అందరు కలిసి సంయుక్తంగా నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ధరమ్ సందీప్ స్వరాలు సమకుర్చారు. కథ "చరిత్ర ఎప్పుడూ కొత్తగా తయారు కాదు...అది ఎప్పుడు అవే సంఘటనలతో పునరావృతం అవుతూంటుది" అన్నది నానుడి. ఇదే పాయింటుని అనుసరిస్తూ ఈ సెకెండా పార్ట్ కథనం కొనసాగుతుంది. ప్రతాప్ రవి (వివేక్ ఒబరాయ్)తన తండ్రిని చంపారని పగతో చేసిన హత్యతో తనలాంటి మరో వ్యక్తిలో పగకి ప్రాణం పోసానని ఆలస్యంగా తెలుసుకుంటాడు. అతనెవరో కాదు ప్రతాప్ రవి మొదట చంపిన నరసింహరెడ్డి కొడుకు సూర్యభాను రెడ్డి అలియాస్ సూర్య (తమిళ హీరో సూర్య). అయితే సూర్య...తన తండ్రిని ప్రతాప్ చంపాడని తెలసినా మొదట పగ, ప్రతీకారాలే జీవితం కాదని వాటికి దూరంగా బ్రతుకుదామనుకుని నిర్ణయించుకుంటాడు. అయితే రక్త చరిత్ర అతన్ని పగవైపే మళ్ళిస్తుంది. ప్రతాప్ పెట్టిన టీవీ బాంబుతో తన తల్లి, తమ్ముడు, చెల్లి చచ్చిపోయారని తెలుసుకున్న సూర్య రగిలిపోయి..ప్రతాప్ ని చంపాలని బయిలుదేరతాడు. అయితే అది నెరవేరక పోలీసులకు లొంగిపోయి..జైలులోంచే ప్రతాప్ చావుకు ప్లాన్ చేస్తాడు.దానకి జైల్లోనే పరిచయమైన కిరాయి హంతకుడు ముద్దుకృష్ణ సాయిపడతాడు..అంతేగాక రాజకీయంగానూ దెబ్బ కొట్టాలని తన భార్య భార్యభవాని (ప్రియమణి)ని ప్రతాప్ కు పోటిగా ఎలక్షన్లలో నిలబెడతారు. అప్పుడు ప్రతాప్..తనకు అడ్డమవుతున్న సూర్య భార్యని చంపాలనుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది. సూర్య తన భార్యని రక్షించుకోగలిగాడా...ప్రతాప్ ని చంపటమే తన జీవత ధ్యేయమనే సూర్య కోరిక తీరిందా అనేది తెరపై చూడాల్సిందే.
Read More

రక్త చరిత్ర 2 కాస్ట్ & క్రూ

రక్త చరిత్ర 2 సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇమ్రాన్ ఆలీ ఖాన్, సుఖ్విన్దెర్ సింగ్
నిర్మాత మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రక్త చరిత్ర 2 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
"ప్రతికారమే పరమ సోపానం-మహాభారతం, ప్రతికారమే లోక వినాసకం - మహాత్మా గాంధీ" అంటూ రెండు విరుద్దమైన స్టైట్ మెంట్స్ ను ఒకేసారి ప్రస్దావిస్తూ..వర్మ రక్త చరిత్రను మరో సారి తెరమీదకు తెచ్చారు. అయితే ఈ సీక్వెల్ మొదటి రక్త చరిత్ర అంత గాఢత, నిబద్దత, ఆసక్తత లేకుండా ప్లాట్ గా ఓ విరాగి చెప్తున్న కథలా కనీస కుతూహలం కూడా రేపకుండా కొనసాగి..సాగి..సమాప్తమవుతుంది. ఫస్ట్ పార్ట్ చూసినవారంతా చిత్రం క్లైమాక్స్ అనంతరం సూర్య ఎంట్రీని చూసి..ఓహో సెకెండాఫ్ ఇంకే రేంజిలో ఉంటుందో, యాక్షన్ స్టార్ సూర్య ఏ రేంజిలో అదరకొడతాడో అని భావించి ఓపినింగ్స్ అదిరిపోయేలా ఇచ్చారు. అయితే దాదాపు సినిమా మొత్తం సూర్య పాత్రని జైల్లో నే ఉంచి కథ నడుపుదామని చేసిన ప్రయత్నంలో ఆ పాత్ర ఏమీ చేయటానికి లేకుండాపోయింది. ఎంత వాస్తవ కథ చెప్తున్నా జైల్లో కూర్చుని ప్లాన్స్ వేసే వ్యక్తి కథని చూడటం కష్టమే కదా. అయితే సూర్య మాత్రం తన కళ్ళతోనే నటన చూపించిన సన్నివేశాలు మాత్రం హైలెట్ గా నిలుస్తాయి. అలాగే సినిమాలో వర్మ తీసిన కొన్ని షాట్స్ కొత్తగా ఉండి సినీ అభిమానులకు నచ్చుతాయి. మరి ప్రేక్షకుల సంగతేమేమిటంటే...

రక్త చరిత్ర 2 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • What a movie i like this movie very much surya sir dedicated roles as father son everithing is fine hee not acted his roles he just leave i like this move loot

×
2.9 /5 Your Rating

రక్త చరిత్ర 2

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+