రక్త చరిత్ర సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వివేక్ ఒబెరాయ్, రాధిక అప్టే, ప్రియమణి, సూర్య, శత్రుఘ్న సిన్హా, సుదీప్, అభిమన్యు సింగ్ ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాతలు మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ధరమ్ సందీప్ స్వరాలు సమకుర్చారు
కథ
సిటీలో చదువుకుంటున్న ప్రతాప్ రవి(వివేక్ ఒబరాయ్) తండ్రి హత్యకు గురి అవటంతో తన ఊరు ఆనందపల్లికి వస్తాడు. అయితే అప్పటికే తన అన్న అడవుల్లోకి వెళ్ళి గొరిళ్లా పద్దతుల్లో పగ తీర్చుకుంటున్నాడని తెలుసుకుంటాడు. అన్నకి సపోర్టు ఇచ్చి తానూ ఆ పగ తీర్చుకునే క్రమంలో పాలుపంచుకోవాలా వద్దా అనే డైలమాలో ఉన్న ప్రతాప్ కి తన అన్న కూడా పోలీసులకు దొరికి లాకప్ డెత్ చేయబడటం రగిలిస్తుంది. అక్కడనుంచి తన తండ్రి,అన్న మరణానికి కారణమైన వారిని వేటాడి వేటకొడవళ్ళుతో చంపేస్తాడు. అయితే హత్యకు గురైన నాగమణి రెడ్డి (కోట శ్రీనివాసరావు)కో కొడుకు బుక్కారెడ్డి(అభిమన్యు సింగ్) ఉంటాడు. బుక్కారెడ్డి మామూలుగానే మహా నీచుడు. అలాంటిది తన తండ్రి హత్యకు గురౌటంతో చంపిన ప్రతాప్ రవి పై కక్ష తీర్చుకోవాలని తిరుగుతూంటాడు. మరో ప్రక్క సినిమా స్టార్ శివాజీ రావు (శత్రుఘ్న సిన్హా) కొత్తగా తను పెట్టిన ప్రజాదేశం పార్టి టిక్కెట్ ప్రతాప్ రవికి ఇస్తాడు. అది జీర్ణించుకోలేని బుక్కారెడ్డి ఏం ఎత్తువేస్తాడు. దాన్ని ప్రతాప్ ఎలా ఎదుర్కొంటాడు అన్న విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.