X
తెలుగు » సినిమాలు » రక్త చరిత్ర
రక్త చరిత్ర

రక్త చరిత్ర

Action | Thriller | 22 Oct 2010 | A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

రక్త చరిత్ర స్టోరీ

రక్త చరిత్ర సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వివేక్ ఒబెరాయ్, రాధిక అప్టే, ప్రియమణి, సూర్య, శత్రుఘ్న సిన్హా, సుదీప్, అభిమన్యు సింగ్ ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాతలు మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ధరమ్ సందీప్ స్వరాలు సమకుర్చారు కథ సిటీలో చదువుకుంటున్న ప్రతాప్ రవి(వివేక్ ఒబరాయ్) తండ్రి హత్యకు గురి అవటంతో తన ఊరు ఆనందపల్లికి వస్తాడు. అయితే అప్పటికే తన అన్న అడవుల్లోకి వెళ్ళి గొరిళ్లా పద్దతుల్లో పగ తీర్చుకుంటున్నాడని తెలుసుకుంటాడు. అన్నకి సపోర్టు ఇచ్చి తానూ ఆ పగ తీర్చుకునే క్రమంలో పాలుపంచుకోవాలా వద్దా అనే డైలమాలో ఉన్న ప్రతాప్ కి తన అన్న కూడా పోలీసులకు దొరికి లాకప్ డెత్ చేయబడటం రగిలిస్తుంది. అక్కడనుంచి తన తండ్రి,అన్న మరణానికి కారణమైన వారిని వేటాడి వేటకొడవళ్ళుతో చంపేస్తాడు. అయితే హత్యకు గురైన నాగమణి రెడ్డి (కోట శ్రీనివాసరావు)కో కొడుకు బుక్కారెడ్డి(అభిమన్యు సింగ్) ఉంటాడు. బుక్కారెడ్డి మామూలుగానే మహా నీచుడు. అలాంటిది తన తండ్రి హత్యకు గురౌటంతో చంపిన ప్రతాప్ రవి పై కక్ష తీర్చుకోవాలని తిరుగుతూంటాడు. మరో ప్రక్క సినిమా స్టార్ శివాజీ రావు (శత్రుఘ్న సిన్హా) కొత్తగా తను పెట్టిన ప్రజాదేశం పార్టి టిక్కెట్ ప్రతాప్ రవికి ఇస్తాడు. అది జీర్ణించుకోలేని బుక్కారెడ్డి ఏం ఎత్తువేస్తాడు. దాన్ని ప్రతాప్ ఎలా ఎదుర్కొంటాడు అన్న విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Read More

రక్త చరిత్ర కాస్ట్ & క్రూ

రక్త చరిత్ర సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇమ్రాన్ ఆలీ ఖాన్, సుఖ్విన్దెర్ సింగ్
నిర్మాత మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రక్త చరిత్ర విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రామూ...రక్తమూ ఎప్పుడూ హాట్ టాపిక్సే. ఇక ఆ రెండూ కలిస్తే ఇంకేముంది. నిజానికి నాకు ఈ సినిమా మొదలైనప్పటినుంచీ ఓ సందేహం పీకుతోంది. హిందీ హీరోతో తెలుగువారి కథ ఎంతవరకూ వర్కవుట్ అవుతుంది..జనం డబ్బింగ్ సినిమాలా ఫీలవరా అని. అయితే రక్త చరిత్ర చూసాక కేవలం పాత్ర మాత్రమే కనపడటానికే రామూ ఈ సాహసం చేసారని అర్దమైంది. రాయలసీమ వాస్తవ కక్షల చరిత్ర నేఫధ్యంతో పక్కా ఫార్ములా కథ అల్లి, విలన్-హీరోల మధ్య సంఘర్షణలనే హైలెట్ చేస్తూ వర్మ ఈ రక్త చరిత్ర సృష్టించారు. దాంతో చిత్రం చరిత్ర సృష్టించకపోయినా ప్రేక్షకాదరణకు మాత్రం లోటుండదని అన్పిస్తుంది. అయితే క్లైమాక్స్ లో కంక్లూజన్ ఇవ్వకుండా సెకెండ్ పార్ట్ కోసం వదిలేయటం మాత్రం కొంత నిరాశ కల్గిస్తుంది. అలాగే మితిమీరిన హింస (వర్మ చెప్తున్నదే అనుకోండి) ఫ్యామిలలను ధియోటర్స్ వైపు కన్నెత్తి చూడనీయదు. ఇక వీటిని ప్రక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ తిరిగి తనను తాను ఆవిష్కరించుకుంటూ తీసిన కొత్త షాట్స్, ప్రేమ్ లు చూడ్డానికి మాత్రం సినీ ప్రియులు వెళ్ళాల్సిందే.

రక్త చరిత్ర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రక్త చరిత్ర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+