X
రామబాణం
Action | Drama | Romance | 05 May 2023 | U/A | 142 Mins
Telugu

రామబాణం స్టోరీ

రామబాణం సినిమా యాక్షన్, రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, డింపుల్ హయతి, నాజర్, జగపతి బాబు,  వెన్నెల కిషోర్, సప్తగిరి, అలీ, రాజా రవీంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ వహించారు. నిర్మాతలు టి జి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు. 
కథ
కుటుంబ విలువలకు, నీతి నియమాలకు కట్టుబడే రాజారాం (జగపతి బాబు) హోటల్ బిజినెస్ నిర్వహిస్తూ ఆర్గానిక్ ఫుడ్ పెడుతుంటాడు. వ్యాపారంలో పోటీని తట్టుకోలేక పాపారావు (నాజర్) అధికారులతో చేతులు కలిపి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే రాజారాం సోదరుడు విక్కీ ( గోపిచంద్) ఓ త్రీవమైన చర్యకు పాల్పడుతాడు. దాంతో విక్కీని రాజారాం మందలిస్తాడు. ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చిన మంచి దారినే నడువాలని కోపగించుకొంటాడు. అయితే అన్నయ్య దారిలో నడవడం ఇష్టం లేక ఇంటి నుంచి విక్కీ చిన్నతనంలో పారిపోతాడు. అలా కలకత్తాకు పారిపోయిన విక్కీ 14 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత ఇంటికి వస్తాడు. రాజారాంకు పాపారావు ఇబ్బంది పెడితే విక్కీ తీసుకొన్న నిర్ణయం ఏమిటి? విక్కినీ ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంటి నుంచి కోల్ కత్తాకు పారిపోయిన విక్కీ ఎలాంటి జీవితాన్ని లీడ్ చేశాడు. కోల్‌కత్తాలో భైరవి (డింపుల్ హయతి)తో ప్రేమ కథ ఎలా సాగింది? కోల్ కతాలో ముఖర్జీ అనే మాఫియా డాన్‌తో జరిగిన గొడవలు ఏంటి? కోల్‌కతా నుంచి విక్కీ ఎందుకు ఇంటికి వచ్చాడు? 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన విక్కీని రాజారాం కుటుంబ సభ్యులు ఎలా రిసీవ్ చేసుకొన్నాడు. రాజారాంను కష్టాల్లో పడేసిన పాపారావు, పాపారావు (తరుణ్ అరోరా)ను ఎలా ఎదిరించాడు. తన కుటుంబానికి ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే రామబాణం సినిమా . 

రిలీజ్ డేట్ 
గోపీచంద్‌ కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న విడుదలైంది 




Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+