X
తెలుగు » సినిమాలు » రామబాణం
రామబాణం

రామబాణం

Action | Drama | Romance | 05 May 2023 | U/A | 142 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

రామబాణం స్టోరీ

రామబాణం సినిమా యాక్షన్, రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, డింపుల్ హయతి, నాజర్, జగపతి బాబు,  వెన్నెల కిషోర్, సప్తగిరి, అలీ, రాజా రవీంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ వహించారు. నిర్మాతలు టి జి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.  కథ కుటుంబ విలువలకు, నీతి నియమాలకు కట్టుబడే రాజారాం (జగపతి బాబు) హోటల్ బిజినెస్ నిర్వహిస్తూ ఆర్గానిక్ ఫుడ్ పెడుతుంటాడు. వ్యాపారంలో పోటీని తట్టుకోలేక పాపారావు (నాజర్) అధికారులతో చేతులు కలిపి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే రాజారాం సోదరుడు విక్కీ ( గోపిచంద్) ఓ త్రీవమైన చర్యకు పాల్పడుతాడు. దాంతో విక్కీని రాజారాం మందలిస్తాడు. ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చిన మంచి దారినే నడువాలని కోపగించుకొంటాడు. అయితే అన్నయ్య దారిలో నడవడం ఇష్టం లేక ఇంటి నుంచి విక్కీ చిన్నతనంలో పారిపోతాడు. అలా కలకత్తాకు పారిపోయిన విక్కీ 14 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత ఇంటికి వస్తాడు. రాజారాంకు పాపారావు ఇబ్బంది పెడితే విక్కీ తీసుకొన్న నిర్ణయం ఏమిటి? విక్కినీ ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంటి నుంచి కోల్ కత్తాకు పారిపోయిన విక్కీ ఎలాంటి జీవితాన్ని లీడ్ చేశాడు. కోల్‌కత్తాలో భైరవి (డింపుల్ హయతి)తో ప్రేమ కథ ఎలా సాగింది? కోల్ కతాలో ముఖర్జీ అనే మాఫియా డాన్‌తో జరిగిన గొడవలు ఏంటి? కోల్‌కతా నుంచి విక్కీ ఎందుకు ఇంటికి వచ్చాడు? 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన విక్కీని రాజారాం కుటుంబ సభ్యులు ఎలా రిసీవ్ చేసుకొన్నాడు. రాజారాంను కష్టాల్లో పడేసిన పాపారావు, పాపారావు (తరుణ్ అరోరా)ను ఎలా ఎదిరించాడు. తన కుటుంబానికి ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే రామబాణం సినిమా .  రిలీజ్ డేట్  గోపీచంద్‌ కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న విడుదలైంది 
Read More

రామబాణం కాస్ట్ & క్రూ

రామబాణం సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీవాస్
స్టోరీ భూపతి రాజా
డైలాగ్ మధుసూదన్ పడమటి
సినిమాటోగ్రఫీ విట్రి పళనిసామి
సంపాదకుడు ప్రవీన్ పుది
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత టి జి విశ్వ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రామబాణం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కుటుంబ విలువలు, ఉమ్మడి కుటుంబం, ఆర్గానిక్ ఫుడ్ అనే కాన్సెప్ట్‌తో లవ్, యాక్షన్, అన్నదమ్ముల అనుబంధాలు బ్యాక్ డ్రాప్‌గా రామబాణం తెరకెక్కింది. ప్రస్తుతం వస్తున్న సినిమాల మధ్య ఈ చిత్రం అవుట్ డేటేడ్ కథగా అనిపిస్తుంది. కాకపోతే జగపతి బాబు, గోపిచంద్ బాండింగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. కుష్బూ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. డింపుల్ హయతి గ్లామర్ పరంగా ఒకే అనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూశామని ఫీలింగ్ కలుగుతుంది. అతిగా ఆశిస్తే కొంత నిరాశపడే అవకాశం లేకపోలేదు. కొత్తదనం లేని.. కలర్‌ఫుల్‌గా, ఎమోషనల్ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మాత్రం చెప్పవచ్చు.

రామబాణం ట్రైలర్

Video Thumbnail

రామబాణం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

రామబాణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+