రామాచారి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వేణు, కమలిని ముకర్జీ, బ్రహ్మానందం, ఆలీ, ఎల్.బి.శ్రీరామ్, గిరిబాబు, చంద్రమోహన్, రఘుబాబు, వేలు, బాలయ్య, మురళీశర్మ, రాజ్‌ప్రేమి, ప్రభు, అమిత్, హర్షవర్ధన్, ఇందుఆనంద్, లిరిష తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఈశ్వర్‌రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత పి వి శ్యాంప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
పోలీస్ ఆఫీసర్ కావాలనేది రామాచారి(వేణు) అనే యవకుడి లక్ష్యం. వివిధ కారణాలతో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోతాడు రామాచారి. దీంతో డిటెక్టివ్‌గా మారి ఆ వృత్తితో సంతృప్తి పడతాడు. అతని స్నేహితులు గంగూలీ(అలీ), చింత(బ్రహ్మానందం) ఈ క్రమంలో రాత్రి ముఖ్యమంత్రి(బాలయ్య)కి అపాయం ఉందనే విషయాన్ని తెలుసుకుంటాడు. ముఖ్యమంత్రిని చంపడానికి జరిగిన కుట్రలో పోలీస్ కమీషనర్ చడ్డ(మురళీ శర్మ) కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. మరి రామాచారి ఈ కుట్రను ఎలా చేధించాడు? అనేది మిగతా కథ.