రామయ్యా వస్తావయ్యా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జూ.ఎన్టీఆర్, సమంత, శృతి హాసన్, రావు రమేష్, కోటశ్రీనివాసరావు, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి, ప్రగతి, అజయ్, భరత్, రవిశంకర్ తదితరులు ప్రధాన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత నిర్మాత: దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
ముఖేష్ రుషి తన పెద్ద కూతురు పెళ్లి చేయటానికి సన్నాహాలు చేస్తూంటే అతనిపై రైవల్ బ్యాచ్ అజయ్ గ్రూఫ్ ఎటాక్ చేస్తుంది. దాన్ని నుంచి తప్పించుకున్న ముఖేష్ రుషి పెళ్లి కి టైట్ సెక్యూరిటీ పెడతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క కాలేజీలో చదువుకుంటున్న నందు(ఎన్టీఆర్) మరో కాలేజీలో చదువుతున్న అమ్మాయి అక్షర (సమంత)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను కూడా ప్రేమలో పడేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. ఆమె మొదట కాదన్నా...తర్వాత ఓకే అంటుంది. అంతేకాకుండా తన అక్క పెళ్లికి రమ్మంటుంది. ఇంతకీ సమంత ఎవరో కాదు ముఖేష్ రుషి రెండో కూతురు. ఆ పెళ్లికి వెళ్లిన ఎన్టీఆర్ ఏం చేసాడు. ముఖేష్ రుషి కి ... ఎన్టీఆర్ కి ఏంటి సంభంధం...శృతి హాసన్ పాత్ర ఏమిటి... అనేది మిగతా కథ.