రణరంగం (2019)(U/A)
Release date
15 Aug 2019
genre
రణరంగం స్టోరి
రణరంగం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాని ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్, రాజా చెంబోలు, ఆదర్స్ బాలకృష్ణన్, మురళీ శర్మ, ప్రవీణ్, రాజా రవీంద్ర, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుధీర్ వర్మ వహించారు. మరియు నిర్మాత నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ పిళ్ళై అందించారు.
కథ
వాల్తేరులో బ్లాక్ టికెట్ల దందాతోపాటు చిన్నా చితక సెటిమెంట్లు చేసే యువకుడు దేవా (శర్వానంద్). గీత (కల్యాణి ప్రియదర్శన్)తో పీకల్లోతు ప్రేమలో పడుతాడు. స్థానికంగా ఉండే ముఠాల ఆధిపత్యపోరులో దేవా గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అక్రమ మద్యం వ్యాపారం విషయంలో ఎమ్మెల్యే (మురళీ శర్మ)కు పోటీగా ఎదుగుతాడు. కొన్ని పరిస్థితుల కారణంగా వాల్తేరు నుంచి స్పెయిన్‌కు మకాం మారుస్తాడు. అక్కడ డాక్టర్ (కాజల్ అగర్వాల్)కు చేరువవుతాడు.
వాల్తేరులో నంబర్ వన్ గ్యాంగ్‌స్టర్‌గా పేరు సంపాదించుకొన్న దేవా స్పెయిన్‌కు ఎందుకు వెళ్లాడు? స్పెయిన్ నుంచి ఆంధ్రాలో దందాను ఎలా ప్రభావితం చేశాడు. అంతర్గత ముఠాల పోరులో దేవా తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకొన్నాడు. గీతతో ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? కాజల్‌కు దేవా ఎందుకు చేరువకావాల్సి వచ్చింది? ఆంధ్రాలోని మాఫియా రాజకీయాలకు ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే రణరంగం.
**Note:Hey! Would you like to share the story of the movie రణరంగం with us? Please send it to us ([email protected]).