రంగ మార్తాండ సినిమా ఫ్యామిలీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, వంశీ చాగంటి, శివాత్మిక రాజశేఖర్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, చిరంజీవి, అలీ రెజా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ వంశీ వహించారు. నిర్మాత అభిషేక్ జవకర్ నిర్మించారు. సంగీతం ఇళయరాజా అందించారు.
రిలీజ్ డేట్
రంగ మార్తాండ సినిమా మార్చి 22 న రిలీజ్ అయ్యింది
కథ
రాఘవరావు (ప్రకాశ్ రావు) ప్రముఖ రంగస్థల నటుడు. తన జీవితాన్ని నాటక రంగానికి అంకితం చేసి ఎన్నో అద్బుతమైన పాత్రలను పోషించడమే కాకుండా రంగస్థలానికి మంచిపేరు తెచ్చినందుకు ఆయనకు రంగ మార్తండ అనే బిరుదును ఇచ్చి సన్మానిస్తారు. తన సన్మాన కార్యక్రమంలో ఇక నాటక రంగానికి సెలవు అంటూ రాఘవరావు సంచలన ప్రకటన చేస్తారు. అలాగే జీవిత కాలంలో సంపాదించిన ఆస్తులను కూతురు బంగారం అలియాస్ శ్రీ (శివాత్మిక రాజశేఖర్) కొడుకు రంగారావు (ఆదర్శ్ బాలకృష్ణ)కు సమానంగా పంచి ఇస్తారు. ఇక తన శేష జీవితాన్ని భార్య సావిత్రి అలియాస్ రాజు (రమ్యకృష్ణ), కుటుంబంతో గడపాలని నిర్ణయించుకొంటారు.అయితే ఆస్తులన్నీ రాసిచ్చేసిన రాఘవరావు దంపతుల జీవితం సవ్యంగా సాగిందా? కొడుకు, కోడలు (అనసూయ భరద్వాజ్) నుంచి రాఘవరావుకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. రాఘవరావు కుమార్తె శ్రీ, అల్లుడు రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్)తో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి రాఘవరావు జీవితంలో చక్రవర్తి (బ్రహ్మానందం) పాత్ర ఏమిటి? చక్రవర్తి తన జీవితంలో అనుభవించే సమస్య ఏమిటి? చక్రవర్తి ఎందుకు ఆత్మత్యాగం చేయాలని అనుకొన్నాడు. రాఘవరావు దంపతుల జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే రంగ మార్తండ సినిమా