X
తెలుగు » సినిమాలు » రంగ మార్తాండ
రంగ మార్తాండ

రంగ మార్తాండ

Drama | Family | 22 Mar 2023 | U | 153 Mins
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

రంగ మార్తాండ స్టోరీ

రంగ మార్తాండ సినిమా ఫ్యామిలీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, వంశీ చాగంటి, శివాత్మిక రాజశేఖర్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, చిరంజీవి, అలీ రెజా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ వంశీ వహించారు. నిర్మాత అభిషేక్ జవకర్ నిర్మించారు. సంగీతం ఇళయరాజా అందించారు.  రిలీజ్ డేట్   రంగ మార్తాండ సినిమా మార్చి 22 న రిలీజ్ అయ్యింది  కథ రాఘవరావు (ప్రకాశ్ రావు) ప్రముఖ రంగస్థల నటుడు. తన జీవితాన్ని నాటక రంగానికి అంకితం చేసి ఎన్నో అద్బుతమైన పాత్రలను పోషించడమే కాకుండా రంగస్థలానికి మంచిపేరు తెచ్చినందుకు ఆయనకు రంగ మార్తండ అనే బిరుదును ఇచ్చి సన్మానిస్తారు. తన సన్మాన కార్యక్రమంలో ఇక నాటక రంగానికి సెలవు అంటూ రాఘవరావు సంచలన ప్రకటన చేస్తారు. అలాగే జీవిత కాలంలో సంపాదించిన ఆస్తులను కూతురు బంగారం అలియాస్ శ్రీ (శివాత్మిక రాజశేఖర్) కొడుకు రంగారావు (ఆదర్శ్ బాలకృష్ణ)‌కు సమానంగా పంచి ఇస్తారు. ఇక తన శేష జీవితాన్ని భార్య సావిత్రి అలియాస్ రాజు (రమ్యకృష్ణ), కుటుంబంతో గడపాలని నిర్ణయించుకొంటారు.అయితే ఆస్తులన్నీ రాసిచ్చేసిన రాఘవరావు దంపతుల జీవితం సవ్యంగా సాగిందా? కొడుకు, కోడలు (అనసూయ భరద్వాజ్) నుంచి రాఘవరావుకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. రాఘవరావు కుమార్తె శ్రీ, అల్లుడు రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్)తో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి రాఘవరావు జీవితంలో చక్రవర్తి (బ్రహ్మానందం) పాత్ర ఏమిటి? చక్రవర్తి తన జీవితంలో అనుభవించే సమస్య ఏమిటి? చక్రవర్తి ఎందుకు ఆత్మత్యాగం చేయాలని అనుకొన్నాడు. రాఘవరావు దంపతుల జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే రంగ మార్తండ సినిమా
Read More

రంగ మార్తాండ కాస్ట్ & క్రూ

రంగ మార్తాండ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కృష్ణవంశీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత అభిషేక్ జవాల్కర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రంగ మార్తాండ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయత, అనురాగాల, భావోద్వేగాలు దట్టించిన చిత్రం రంగ మార్తండ. దర్శకుడు కృష్ణవంశీ సన్నివేశాలను తెరపైన పేర్చిన తీరు..పాత్రలను రాసుకొన్న తీరు.. స్క్రీన్ మీద సజీవంగా మార్చాయి. నాగరికత పేరుతో విచ్చిన్నమవుతున్న కుటుంబాలు, స్వార్ధంతో బతుకుతున్న మనుషులకు రంగ మార్తండ చెంపపెట్టులా ఉంటుంది. ఆనందం, బాధ, దు:ఖం, వినోదం అందిస్తూ.. ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. కుటంబంలో పిల్లలు ఎలా ఉండాలి? జీవిత చరమాంకంలో తల్లిదండ్రుల ధీనస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఫ్యామిలీ అంతా చూడాల్సిన చిత్రం రంగ మార్తండ.

రంగ మార్తాండ ట్రైలర్

Video Thumbnail

రంగ మార్తాండ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

రంగ మార్తాండ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+