రంగా ది దోంగా సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, విమల రామన్, రమ్యకృష్ణ, శివాజీరాజా, తిరుపతి ప్రకాష్, సుధాకర్(జి.వి), జయప్రకాష్ రెడ్డి, తెలంగాణా శకుంతల, చలపతిరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుధాకర్ (జి వి) నిర్వహించారు మరియు నిర్మాత సి ఆర్ మనోహర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చరు.
కథ
అనంతపురం జిల్లాలో ఉన్న పులిచర్లలో ఒక ఫ్యాక్షనిస్టు చేసే అరాచకాలకు సింహపురిలోని ఒక వ్యక్తి ప్రజల తరపున తిరగడతాడు. తిరగబడినతన్ని ఫ్యాక్షనిస్టు చంపితే విదేశాల్లో ఉన్న అతని కొడుకు తండ్రి బాధ్యతని చేపడతాడు. గర్భవతి అయిన అతని భార్య ఇది ఇష్టం లేక పదేళ్ళ కొడుకుతో పాటు పుట్టింటికి వెళ్ళబోతే నా కొడుకు భానుప్రసాద్(శ్రీకాంత్) ఇక్కడే ఉండి, నా తండ్రి ఆశయాలను సాధిస్తాడు. నీ కడుపులో పెరుగుతున్న వాణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకో అంటాడు భర్త. ఇలా ఆమె పుట్టింటికి వెళుతుండగా ఆమెపై దాడి జరుగుతుంది.
ఆ దాడి నుండి పారిపోతూండగా నెప్పులు వచ్చి ఒక మగబిడ్డను కని తన పక్కనున్నమనిషి(తెలంగాణాశకుంతల)కి ఇచ్చి మనిషిలా పెంచమని కన్నుమూస్తుంది. ఆ బిడ్దను తీసుకుని హైదరాబాద్ లోని స్టువర్ట్ కాలనీకి వెళ్తుంది ఆ మనిషి(తెలంగాణాశకుంతల). అక్కడ ఆ పిల్లాడు రంగ (శ్రీకాంత్)దొంగగా మారతాడు. పోలీసుల అరాచకాలు చిన్నప్పుడు చూసిన ఆ రంగ అచ్చంగా పోలీసుల ఇళ్ళలోనే దొంగతనాలు చేస్తుంటాడు. అతను ఒక నేరం మీద కోర్టుకి వెళ్ళగా అక్కడ అతని మీద బాంబుదాడి జరుగుతుంది.
ఆ దాడిలో అతను చనిపోతాడు. అతనే భానుప్రసాద్. అతను అచ్చం తనలానే ఉండటంతో రంగ ఆశ్చర్యపోతాడు. భానుప్రసాద్ మనుషులు రంగను సింహపురి తీసుకెళ్ళి భాను ప్రసాద్ భార్య (రమ్యకృష్ణ)ముందుంచుతారు. ఆమె రంగను భాను ప్రసాద్ గా నటింపజేస్తుంది. రంగ ద్వారా తన భర్త ఆశయాల సాధనకు ఆమె కృషి చేస్తుంది. రంగ తన అన్న ఆశయాలను సాధించాడా లేదా అన్నది తెరమీద చూడాల్సిందే.